calender_icon.png 23 July, 2025 | 6:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ బంగారంతో మోసం ఇద్దరు నిందితులు అరెస్ట్

23-07-2025 12:59:00 AM

నిర్మల్, జూలై 22 (విజయక్రాంతి): నిర్మల్ ప్రాంతంలో అమాయక ప్రజలను మోసం చేసి నకిలీ దొంగ బంగారాన్ని విక్రయిస్తున్న ఇద్దరు దంపతులను మంగళవారం రాత్రి అరెస్టు చేసినట్లు ఏ ఎస్ పి రాకేష్ మీనా తెలిపారు. నెల్లూరు జిల్లా, సంగం మండలం, రాళ్లచెలిక గ్రామానికి చెందిన కర్రెద్దుల మల్యాద్రి (s/o మాల కొండయ్య) మరియు అతని భార్య కర్రెద్దుల సుభాషిని (w/o మల్యాద్రి) ఇద్దరూ కూలీ పనులు చేస్తూ జీవనం  సాగిస్తుండే వారన్నారు.

తమ ఆదాయం సరిపోవడం లేదని భావించిన వారు, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి జల్సాలు చేసేందుకు కుట్రకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో నకిలీ బంగారాన్ని గుండ్ల రూపంలో తయారు చేయించి, నిజమైన బంగారం అని నమ్మబలికి సోన్ మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన పలువురి దగ్గర భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టు తెలిపారు గ్రామస్తులకు అనుమానం రావడంతో వారికోసం వెతకగా అనంతరం వారు పరారయ్యారు.

సమాచారం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ డా. జి.జానకి షర్మిల ఐపిఎస్ గారి ఆదేశాను సారం సోన్ సిఐ జి.గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో, సోన్ ఎస్‌ఐ కె. గోపీ, లక్ష్మణాచందా ఎస్‌ఐ శ్రీనివాస్, HC చి. విజయ్ కుమార్ లు, ఒక బృందంగా ఏర్పడి నిందితులను చాకచక్యంగా పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.వీరితో పాటు PC రాజు, భీమన్న, కీర్తన, సంధ్య, లతీఫ్ తదితరులు సాంకేతిక సిబ్బంది సహకారంతో ఇద్దరిని గుర్తించడం జరిగింది అన్నారు.

ఈ సందర్భంగా నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీన మాట్లాడుతూ ఎవరైన తక్కువ ధరకు బంగారం ఇస్తామంటే నమ్మి మోసపోవద్దు అని,ప్రజలు ఇలాంటి విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వారి వద్ద నుంచి 20వేల నగదు ఒక టీవీ ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఏఎస్పీ వివరించారు