calender_icon.png 8 September, 2025 | 8:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మన శంకరవరప్రసాద్ గారు ఆటాపాటకు సిద్ధమయ్యారు

08-09-2025 12:59:12 AM

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’. ‘పండుగకు వస్తున్నారు’ అనేది ఈ సినిమాకు ట్యాగ్‌లైన్. ఈ చిత్రాన్ని షైన్‌స్క్రీన్స్, గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఇందులో నయనతార కథానాయిక కాగా, వీటీవీ గణేశ్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. విక్టరీ వెంకటేశ్ అతిథి పాత్రలో అలరించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

చిరంజీవి, నయనతార, ఇతర ప్రధాన తారాగణం కీలక టాకీ పార్ట్ చిత్రీకరణలో టీమ్ బిజీగా ఉంది. ఇందులో భాగంగా సోమవారం నుంచి చిరంజీవి, నయనతారలపై ఒక పాటను హైదరాబాద్‌లో చిత్రీకరించనున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమా కోసం అద్భుతమైన ఆల్బమ్‌ను రూపొందించారు. తాజాగా చిత్రీ కరించనున్న పా టను డ్యాన్స్ మాస్ట ర్ విజ య్ పోలంకి కొరియోగ్రఫీ చేస్తున్నారు. 2026 సంక్రాంతి సందర్భంగా విడుదల కాను న్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో; డీవోపీ: సమీర్‌రెడ్డి; ఎడిటర్: తమ్మిరాజు.