19-12-2025 12:00:00 AM
ఒక్క సంవత్సరంలోనే విజయవంతంగా పూర్తిచేసిన యశోద హాస్పిటల్స్ వైద్యులు
హైదరాబాద్, డిసెంబర్ 18 (విజయక్రాంతి) : యశోద హాస్పిటల్స్- హైటెక్ సిటీ, తెలుగు రాష్ట్రాల వైద్య చరిత్రలో ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించినట్లు యశోద హాస్పిటల్స్ సగర్వంగా ప్రకటించింది. కేవలం ఒక్క సంవత్సరంలోనే వెయ్యికి పైగా మేజర్ రోబోటిక్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాలు భారతదేశంలోనే అధునాతన రోబోటిక్ సర్జికల్ కేర్ రంగంలోనూ, జాతీయ మెడికల్ కేర్ హబ్ గా, ప్రముఖ వైద్య కేంద్రాలలో ఒకటిగానూ, తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాదాపూర్ డిసిపి రితి రాజ్, యశోద హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ జి.ఎస్. రావు, ఇతర సీనియర్ సర్జన్లు, డాక్టర్లు, వివిధ విభాగాల వైద్యసిబ్బందితో కలిసి పాల్గొన్నా రు. డిసిపి రితి రాజ్ మాట్లాడుతూ.. కేవలం ఒక్క సంవత్సర కాలంలోనే వెయ్యికి పైగా విజయవంతమైన మేజర్ రోబోటిక్ శస్త్రచికిత్సల మైలురాయిని, మొదటిసారిగా సాధిం చడం కేవలం యశోద హాస్పిటల్స్‌కు మాత్ర మే కాక మన హైదరాబాద్ నగరానికి, తెలు గు రాష్ట్రాలకు కూడా ఎంతో గర్వకారణం అన్నారు.
యశోద హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్. జి.ఎస్. రావు మాట్లాడుతూ.. వెయ్యికి పైగా రోబోటిక్స్ సర్జరీల్లో 434 గైనకాలజీ, గైనక్ ఆంకాలజీ సర్జరీలు, 310 జనరల్, జీఐ, హెచ్‌పీబీ విధానాలు, 177 యూరాలజీ సర్జరీలు, 79 థొరాసిక్ సర్జరీలు, అత్యంత సంక్లిష్టమైన హెడ్, నెక్ రోబో టిక్ విధానాలు ఉన్నాయన్నారు.