30-09-2025 02:28:40 AM
మహబూబాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): ఇటీవల విడుదల చేసిన గ్రూప్ -2 సర్వీస్ పోస్టులలో మహబూ బాబాద్ పట్టణానికి చెందిన మల్లూరి పద్మ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 పోస్టుకు ఎంపికయ్యారు. పట్టణంలోని భవాని నగర్ కు చెందిన మల్లూరి వీరభద్రం విజయ లక్ష్మిల కూతురు పద్మ ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని దృఢ సంకల్పంతో మామ పొక్కుల సదానందం స్ఫూర్తితో గ్రూప్-2 పరీక్షలకు ఒక లక్ష్యాన్ని ఏర్పర చుకొని, నిరంతరం శ్రమించి ఉద్యోగాన్ని సాధించానని ఆనందాన్ని వెలిబుచ్చారు.
నాకు వచ్చిన ఈ అవకాశానికి నిజాయితీగా ఉద్యోగ బాధ్యతలతో ప్రజలందరికీ సేవ చేస్తానని, ఈ ఉద్యోగం రావడానికి నన్ను వెన్నంటి సహకరించిన మా భర్త విజయ్ అత్త, మామలు సదానందం శ్రీకళలకు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియ జేశారు. ఈ సందర్భంగా ఆమెను నలంద విద్యాలయాల కరెస్పాండెంట్ డోలి సత్యనారాయణ, కళ్లెం వీరారెడ్డి , టీఎన్జీవోస్ జిల్లా బాధ్యులు పమ్మిరాజు, మరసం అధ్యక్షులు మద్దెర్ల రమేష్, దుప్పటి శ్రీనివాస్, మెంతుల శ్రీనివాస్, ఏనుగుతల ఉప్పలయ్య, చొప్పరి శ్రీనివాస్ తదితరులు ఆమెను ఘనంగా సన్మానించారు.