calender_icon.png 30 September, 2025 | 6:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మవారికి 51 రకాల ప్రసాదాల నైవేద్యాలు

30-09-2025 02:26:52 AM

వెంకటాపురం(నూగూరు), సెప్టెంబర్ 29 (విజయక్రాంతి):  మండల కేంద్రంలోని బండ్ల బజార్లో ఆదివారం శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆ ప్రాంత భక్తులు ప్రత్యేక నైవేద్యాలు అమ్మవారికి సమర్పించారు. శ్రీ చండీ మాత అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారికి పూజా కార్యక్రమంలో 51 రకాల పిండివంటలతో ప్రసాదాలు చేసి నైవేద్యాలు సమర్పించారు.

అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ ప్రాంతవాసులు శ్రీదేవి శరన్నవ రాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పూజా కార్యక్రమం అనంతరం మండపం ఎదురుగా తులసి కోట వద్ద ఆనంద సందోహాల నడుమ బతుకమ్మ నృత్యాలు చేస్తూ సందడి చేస్తున్నారు.

సోమవారం ఎంగిలిపూల బతుకమ్మ కావడంతో ఆ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అందంగా అలంకరించిన బతుకమ్మలను ఆటపాటలతో పూజా కార్యక్రమాలు అనంతరం గంగ ఒడికి బతుకమ్మలను మహిళలు చేర్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు అత్యంత భక్తిశ్రద్ధల నడుమ పాల్గొన్నారు.