calender_icon.png 26 September, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫైనల్‌కు పాకిస్థాన్

26-09-2025 01:16:31 AM

28న భారత్‌తో తుదిపోరు 

దుబాయ్, సెప్టెంబర్ 25: పాకిస్థాన్ ఆసియాకప్ ఫైనల్‌కు చేరుకుంది. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్-4 పోరులో బంగ్లాదేశ్‌పై 11 పరుగుల తేడా తో విజయం సాధించింది. గ్రూప్-4లో రెండు విజయాలు నమోదు చేసిన పాకిస్థాన్ ఆదివారం భారత్ తో ఫైనల్ పోరులో తలపడేందుకు అర్హత సాధించింది. శుక్రవారం జరిగే నామమాత్రపు పోరులో భారత జట్టుతో శ్రీలంక తలపడనుంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. 136 పరుగుల స్వల్ప లక్ష ఛేదనతో బరిలోకి దిగిన బంగ్లా 124/9కే పరిమితమైంది.