calender_icon.png 14 January, 2026 | 5:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్వోసీలో పాక్ డ్రోన్లు

14-01-2026 02:34:17 AM

  1. భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్ కొద్దిగంటలకే ఘటన
  2. అప్రమత్తమైన సైన్యం.. ఆ ప్రాంతంలో హైఅలెర్ట్

శ్రీనగర్, జనవరి ౧౩: పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యలు కు పాల్పడితే గట్టిగా చెప్తే బుద్ధిచెప్తామని మంగళవారం మధ్యాహ్నం తీవ్రమైన హెచ్చరికలు జారీచేసిన కొద్ది గంటలకే, రాత్రి ఎల్వోసీ వెంబడి పాకిస్థాన్‌కు చెందిన రెండు డ్రోన్లు చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్ దుంగాలానబ్లాలో భారత సైన్యం ఆ డ్రోన్లు గుర్తించింది. వాటిపై జవాన్లు కాల్పుల జరపడంతో తర్వాత డ్రోన్లు కనిపించలేదు.

ఈ ఘటనతో ఆర్మీ ఉన్నతాధికారులు సరిహద్దు ప్రాం తాల్లో హై అలర్ట్ ప్రకటించారు. డ్రోన్ల ద్వారా పాకిస్థాన్ ఆయుధాలను భారత భూతలంలోకి జారవిడిచే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు రాజౌరీ పూంచ్ జిల్లాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు కథువా జిల్లాలోని బిల్లావర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ దూకుడుగా సాగుతోంది. మంగళవారం ఉదయం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య సుమారు 15 నిమిషాల పాటు భీకర పోరు జరిగింది. బుధవారం భారత సైన్యం తిరిగి ఉగ్రవాదుల కోసం వేట సాగించనున్నది.