calender_icon.png 14 January, 2026 | 5:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

1500 మందికి ఉద్వాసన

14-01-2026 02:32:13 AM

‘మెటా’ సంచలన నిర్ణయం 

ఢిల్లీ, జనవరి 13: ప్రముఖ టెక్ దిగ్గజం మెటా తన రియాలిటీ ల్యాబ్స్ విభాగం నుం చి సుమారు 1,500 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఈ విభాగం లో మొత్తం 15 వేల మంది పనిచేస్తుండగా పది శాతం మందిపై కోత పడనుంది. మెటా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆండ్రూ బోస్వర్త్ కీలక ప్రకటన చేశారు. రియాలిటీ ల్యాబ్స్ ఉద్యోగులందరితో బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు.

దీనిని ఏడాదిలోనే అత్యంత ముఖ్య మైన సమావేశంగా అభివర్ణించారు. ఉద్యోగులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. కాగా మెటావర్స్ కలల కంటే ఏఐ వైపు మొగ్గు చూపడం వల్ల ఈ మార్పులు జరుగుతున్నాయి. మెటా కంప్యూట్’ పేరుతో భారీ డేటా సెంటర్లను నిర్మించాలని సంస్థ లక్ష్యం గా పెట్టుకుంది. కృత్రిమ మేథ (ఏఐ) రంగం లో పెట్టుబడులు పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే లేఆఫ్స్ ప్రక్రియను వేగవంతం చేయడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. గత నెలలోనే 30శాతం బడ్జెట్‌ను తగ్గించినట్లు వార్తలు వచ్చాయి. రాబోయే పదేళ్లలో వేల గిగావాట్ల ఏఐ సామర్థ్యాన్ని పెంచాలని జుకర్బర్గ్ యోచిస్తున్నారు. దీనికి మౌలిక సదు పాయాలు కల్పించనున్నారు. సంస్థలో నాయకత్వ మార్పులు కూడా చోటుచేసుకున్నాయి. మాజీ బ్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్ దీనా పావెల్ మెకార్మిక్ మెటా ప్రెసిడెంట్గా నియమితులయ్యారు.