calender_icon.png 8 November, 2025 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

18 కిలోల గంజాయి పట్టివేత

08-11-2025 12:15:09 AM

భద్రాచలం,నవంబర్ 7: భద్రాచలం పట్టణ శివారులో వాహన తనిఖీల్లో భాగంగా 18 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. వివరా ల్లోకి వెళ్తే.. అబ్కారీ ఎన్ఫోర్స్మెంటు ఖమ్మం ఏఈఎస్ తిరుపతి సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలను ఆపి తనిఖీ చేయగా గంజాయి పట్టుబడినట్లు ఏఈ ఎస్ తిరుపతి చెప్పారు. నిందితులను అదుపులోకి తీసుకుని రెండు బైక్లను  వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. ఈ తనిఖీల్లో ఎస్త్స్ర శ్రీహరిరావు, కానిస్టేబుల్ సుధీర్, వెంకట్, హరీష్, విజయ్, ఉపేందరు పాల్గొన్నారు.