08-11-2025 12:14:54 AM
ముకరంపురా, నవంబరు 7 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కరీంనగర్ పర్యటన సందర్భంగా జాతీయ గో పరిరక్షణ సంస్థ ‘నమో మిషన్ వందే గోమాతరం‘ సభ్యులు గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ యువకులు ఎంతో స్ఫూర్తితో ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని,
దేశాభివృద్ధికి నమో మిషన్ వందే గోమాతరం ఇలాగే కృషి చేయాలని, ప్రపంచానికి దశ దిశగా భారతదేశం ఎదగాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ వీర మద్విరాజ్ ఆచారి, డా.దైవాల వేణు కుమార్, కనపర్తి మురళి, పట్టేo దీపక్, శశీ బాబు, చందా శ్రీనివాస్, గౌరిశెట్టి వరుణ్, రవి యాదవ్, సర్దార్ సంజీత్ సింగ్, మహ్మద్ సలీం, తదితరులుపాల్గొన్నారు.