08-11-2025 12:16:24 AM
-భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ముగింపు ఉత్సవాలు
-డిసెంబర్ 26న ఖమ్మంలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ
-సిపిఐ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచందర్రావు
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 7, (విజయక్రాంతి)భారత గడ్డపై సిపిఐ 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యకర్తలు అభిమానులు విరివిగా విరాళాలు అందజేసి శత దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని ఆ పార్టీ మండల కార్యదర్శి వేసంశెట్టి పూర్ణచంద్రరావు కోరారు. శుక్రవారంపాల్వంచ మండలంలోని కిన్నెరసాని, రాజాపురం, యానంబైల్, పంచాయతీలో. ఇంటింటికి సిపిఐ ప్రచారంలో భాగంగా కరపత్రాలు పంచుతూ విరాళాలు సేకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. భారత కమ్యూనిస్టు పార్టీ 1925 డిసెంబర్ 26న కా న్పూర్లో ఆవిర్భవించిందన్నారు. భారతదేశవ్యాప్తంగా వందేళ్ళ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని. ముగింపు ఉత్సవాల భారీ బహిరంగ సభ ప్రచారాన్ని నిర్వహిస్తూ ఖమ్మం లో జరిగే బ హిరంగ సభలో ప్రజలంతా ఎర్రదండై కదిలి లక్షలాది మందితో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు సిపిఐ జిల్లా జిల్లా సమితి.సభ్యులు. ఇట్టి వెంకట్రావు నిమ్మల రాంబాబు మండల కార్య వర్గ సభ్యులు. రైతు సంఘం మండల అధ్యక్షులు కొంగర అప్పారావు ఎస్.కె కాసిం శెట్టిపల్లి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.