calender_icon.png 8 November, 2025 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి ఉద్యోగుల పరిష్కరించాలి

08-11-2025 12:14:01 AM

కొత్తగూడెం,నవంబర్ 7,(విజయక్రాంతి):సింగరేణి కార్మికుల ఎదు ర్కొం టున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని గు ర్తింపు సంఘం నాయకులు సింగరేణి యాజ మాన్యాన్ని కోరారు. శుక్రవారంసింగరేణి భవన్లో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ను , డైరెక్టర్ (పా) ని గుర్తింపు సంఘం ఎఐటియుసి నాయకులు  కలిసి,సింగరేణిలో నెలకొని ఉన్న పలు సమస్యల పరిష్కారం కోసం చర్చించారు. అందులో భాగంగా చైర్మన్ ని డైరెక్టర్(పా)ను కలిసి పలు సమస్యలు తెలపడం జరిగింది.

సానుకూలంగా స్పందిస్తూ మెడికల్ బోర్డును ఈ నెల ఆఖరిలోపు  ప్రవేశ పెట్టుటకు  అం గీకరించారు.ఇన్వాల్యుడేషన్ అయిన ఉద్యోగుల వారసులు మెడికల్ ఫిట్ అయి పోస్టింగ్ కొరకు  ఎదురు చూస్తున్న 473 మంది నవ యువకులకు ఈనెల 16 తారీకున కొత్తగూడెంలో   పోస్టింగ్ ఆర్దర్స్ అందచేస్తామని హామీ ఇచ్చారు. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ స్థాయి  స్ట్రక్చరల్ కమిటీ సమావేశం  ఈనెల 10న   జాయింట్ కన్సల్టేటివ్ కమిటీ (జే సి సి) సమావేశం,  11న  నిర్వహించుటకు అంగీకరించారు.

కార్మికుల పెండింగ్ సమస్యలు  స్ట్రక్చరల్ కమిటీ సమావేశంలో చర్చిం చి, పరిష్కరించడం జరుగుతుందన్నారు..ఈ కార్యక్రమం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్, ఏఐటియుసి అధ్యక్ష, కార్యదర్శులు  వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజకుమార్, ముస్కే సమ్మయ్య, డిప్యూటీ జనరల్ సెక్రటరీలు,తదితరులు దారులు పాల్గొన్నారు.