18-10-2025 07:26:02 PM
కదలని బస్సులు, వ్యాపారుల స్వచ్ఛంద మద్దతు
పాల్గొన్న ఎమ్మెల్యే, బీసీ ఐక్య వేదిక నేతలు
అచ్చంపేట: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ బిసి ఐక్యవేదిక ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన బంధు నల్లమలలో ప్రశాంతంగా కొనసాగింది. బందులో పార్టీలకతీతంగా అన్ని వర్గాల ప్రజలు నేతలు పాల్గొన్నారు. వ్యాపారులు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ దుకాణాలను మూసివేశారు. బంధు ప్రభావంతో ఆర్టీసీ బస్సులు రోడ్ ఎక్కలేదు. బిసి జేఏసీ నేతలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ కూడలిలో రాస్తారోకో చేపట్టారు. అక్కడే మనవహరం నిర్వహించారు. బందుకు ఎమ్మెల్యే వంశీకృష్ణ మద్దతు తెలుపుతూ పాల్గొన్నారు.