calender_icon.png 17 January, 2026 | 3:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారా హుషార్..!

17-01-2026 12:35:20 AM

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆగమేఘాలపై అభివృద్ధి పనుల ప్రారంభం 

మహబూబాబాద్, జనవరి 16 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణంలోనైనా రావచ్చనే సంకేతాల నేపథ్యంలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు మున్సిపాలిటీల్లో చే పట్టే అభివృద్ధి పనులకు ఆగ మేఘాలపై శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నారు.  మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలో 15 కోట్ల అభివృద్ధి పనులకు శుక్రవారం ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.  మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో కోటి రూపాయల వరకు సిసి రోడ్లు, సైడ్ డ్రైనేజీలను శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరిపెడ మున్సిపాలిటీలో 25 కోట్లతొ అమృత్ స్కీం కింద ఇంటింటికి మంచినీటి పథకం,10 కోట్లతో బీటీ రోడ్లు, మున్సిపాలిటీ సుందరీకరణ, 15 కోట్లతో ప్రతి వార్డులో సీసీ రోడ్డు, సైడ్ డ్రైనేజీ పనులు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. అ లాగే మున్సిఫ్ కోర్ట్ మంజూరు, మొదటి విడతలో 250 ఇందిరమ్మ ఇళ్లు, 1,856 ఇళ్లకు గృహజ్యోతి పథకం కింద ఉచిత కరెంటు ఇస్తున్నట్టు చెప్పారు. 500కు పైగా కొత్త రేషన్ కార్డులు, మ హిళలు ఉచిత బస్సు పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 260 రకాల వ్యాధులకు ఉచిత చికిత్స అం దిస్తున్నట్టు చెప్పారు.

మరిపెడ మున్సిపాలిటీలో నేషనల్ హైవే  పొడిగించి  మనమత్తులు చేయించడం జరిగిందని, మరిపెడ బస్టాండ్ లో సిసి రోడ్డు వేయించినట్లు చెప్పారు. రెండేళ్లలో మరిపెడ సమగ్ర అభివృద్ధి కోసం చేసిన కృషి, ప్రజల దీవెనతో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో 15 వార్డుల్లో గెలిచి తీరుతామని ప్రభుత్వ విప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పెండ్లి రఘువీరా రెడ్డి, ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి, గుగులోతు రవి నాయక్, షేక్ తా జుద్దీన్, కేసముద్రం మార్కెట్ వైస్ చైర్మన్ ఐలమల్లు, రాంలాల్, గంధసిరి అంబరీష పాల్గొన్నారు.