26-09-2025 12:47:38 AM
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల, సెప్టెంబర్ 25: రోడ్లు, డ్రైన్లు, ఇతర అభివృద్ధి సమాంతరంగా చేసేందుకు గాను రూ.12.5 కోట్లు మంజూరు చేసిందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వం జీఓ ఆర్.టీ నెంబర్ 541 ను జారీ చేసినట్లు తెలిపారు. ఇవి కాకుండా ము న్సిపాల్టీకి మరిన్ని నిధులు మంజూరు చేసే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు.
ఇది కాకుండా పట్టణ పరిధిలో వివిధ అభివృద్ధి పనులను చేపట్టడానికి మరో రూ.12.5 కోట్ల ప్రతిపాదనలు కూడా పంపడం జరిగిందన్నారు. పట్టణంలోని పాత బజారుతో సహా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసిన కొత్త లేఅవుట్లలో అభివృద్ధి చెందిన నివాసిత ప్రాంతాల్లోనూ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వివరించారు.