26-09-2025 12:49:11 AM
కృషి చేసిన ఎమ్మెల్యే జీఎంఆర్
పటాన్ చెరు, సెప్టెంబర్ 25 :గుమ్మడిదల మండలం మంబాపూర్ పరిధిలోని ఎస్వీఎస్ రెఫకంప్ పరిశ్రమలో దినసరి కూలీగా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అభి షేక్ రెండు రోజుల క్రితం ప్రమాదవశాత్తు మృతి చెందాడు. కార్మికుడికి తగిన న్యాయం చేయాలని కోరుతూ మృతుడి కుటుంబ సభ్యులతో పాటు ఉత్తరాది రాష్ట్రాల సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను కో రారు.
వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గూ డెం మహిపాల్ రెడ్డి.. పరిశ్రమ ప్రతినిధులతో చర్చించి మృతుని కుటుంబానికి 25 లక్షల రూపాయల నష్టపరిహారంతో పాటు అంత్యక్రియలకు లక్ష రూపాయలు అందించేందుకు యాజమాన్యం అంగీకరించింది. ఈ మేరకు గురువారం చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయ కులు సంజయ్ సింగ్, పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు.