17-07-2025 10:39:00 PM
తుంగతుర్తి(విజయక్రాంతి): ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ఆడబిడ్డలు ముందుకు సాగాలని సిడిపిఓ శ్రీజ అన్నారు. గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల/ కళాశాలలో తెలంగాణ ప్రగతిశీల తల్లిదండ్రుల కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు తల్లిదండ్రుల భరోసా అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... ఆడపిల్లలకు చదివే ఆధారమని సమాజంలో ప్రతి విద్యార్థిని ఉన్నత చదువులు చదివి వారి కాళ్లపై వారు నిలబడాలని శ్రీజ అన్నారు.
విద్య ద్వారానే ఆత్మవిశ్వాసం పెంపుతుందని పేర్కొన్నారు. బాలికల చదువుల కోసం తెలంగాణ ప్రభుత్వం సోషల్ పేరు గురుకులాలతో పాటు విదేశీ విద్య సైతం తోడ్పాటునందిస్తుందని ఇలాంటి అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకొని ముందుకు సాగాలని కోరారు. ఒత్తిడిని ఎదుర్కొనే శక్తిని కూడగట్టుకొని వాటిని జయించాలన్నారు. హలో సరిత ప్రతి జీవితంలో ఒత్తిడి అనివార్యమని దానిని ప్రశాంతంగా ఎదుర్కోవడం మన చేతిలోనే ఉంటుందని సూచించారు.