calender_icon.png 30 August, 2025 | 5:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లితండ్రుల త్యాగాలు వృథా కాకుండా విద్యనభ్యసించాలి

30-08-2025 01:26:33 AM

భద్రాద్రి కొత్తగూడెం ,ఆగస్టు 29, (విజయ క్రాంతి)తల్లిదండ్రుల త్యాగాలు వృధా కాకుండా విద్యార్థులు చదువును అభ్యసించి, ఉన్నత స్థాయికి చేరాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శుక్రవారం డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన ఇంజనీరింగ్, బిఎస్సి మొదటి సంవత్సరం విద్యార్థుల ఓరియంటేషన్ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్య కోసం ఇంటి నుండి దూరంగా పంపే సమయంలో అనేక అపోహలు కలిగి ఉంటారని, ఎలాంటి అపోహలు ఉంచకుండా విద్యార్థులను స్వేచ్ఛనిచ్చి చదువుకు నేలా ప్రోత్సహించాలన్నారు. విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత స్థానాలు మంచి పేరు సంపాదించగలరని ఆయన సూచించారు. ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ డే ను అందరం ఘనంగా నిర్వహిస్తామని మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల లేసి నివాళులు అర్పిస్తామన్నారు.

కానీ ఆయన ఏ కళాశాల నుండి విద్యనభ్యసించారు, వారి యొక్క గురువులు గురించి ఎవరికీ తెలియదని ఆయన తెలిపారు.  ఈ కార్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్టార్ డాక్టర్ వి రామచంద్ర, జియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి,ప్రిన్సిపల్ డాక్టర్ జగన్మోహన్ రాజు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాము, కళాశాల ప్రొఫెసర్లు, సిబ్బంది, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.