30-08-2025 01:24:12 AM
- దేవాదాయ అధికారులకు చుక్కలు చూపిస్తున్న పూజారి
-సస్పెన్సర్ ఆర్డర్ .. బేకాతర్
-ఆ-లయంలో మద్దతు దారులరగడ
-పూజారి నిర్వాకంపై హిందు సంఘాలు ఆగ్రహం
-కథనంపై భక్తుల ప్రశంసలు ..
మణుగూరు, ఆగస్టు 29( విజయ క్రాంతి ) : చారిత్రక ప్రస్థానం కలిగి న కాకతీయుల కాలంనాటి, శివాలయం ప్రతిష్టకు ఓ పూజారి వల్ల బంగం కలుగుతుందని, హిందూ ధర్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాటి కాకతీయ రాణి రుద్రమ, ఆమె మనవడు ప్రతాపరుద్రుడుచే పూజలందుకున్న శివయ్య నేడు కనీస అర్చక పూజలను అందుకొక తన ప్రభావాన్ని కోల్పోతున్నట్లు ఆయన నమ్ముకున్న భక్తులుఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆలయ ప్రధాన పూజారి ఫై, శివాలయంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులపై విజయ క్రాంతి దినపత్రిక జులై 31న శివయ్య ఇదేందయ్యా అనే శీర్షికన కథనం ప్రచురించిన సంగతి పాఠకులకు విదితనే ... విజయ క్రాంతి కథనానికి స్పందించిన స్పందించిన దేవాలయ ధర్మాదాయ శాఖ అధికారులు, ఆ పూజారి నిర్వాకంపై సమగ్ర విచారణ చేపట్టి, తుదకు ఆయనను సస్పెండ్ చేశారు. దీంతో పూజారి మద్దతు దారులు విచారణ అధికారిగా ఆలయ ఈవో శేషయ్య అర్చకునికి సస్పెన్షన్ ఆర్డర్ జారీ చేసేందుకు గురువారం శివాలయానికి వచ్చారు.
ఆయన విధులకు ఆటంకం కలిగిస్తూ అర్చకుని మద్దతుదారులు ఈవోను చుట్టుముట్టి ఏ ఆధారాలతో సస్పెండ్ చేస్తున్నారంటూ నిలదీశారు. అయినప్పటికీ ఏవో సమయమనం పాటిస్తూ అర్చకునికి సస్పెండ్ ఆర్డర్ జారీ చేశారు. దీంతో పూజారి అనుచరులు రగడతో ఆలయ పరిసరాల్లో గందరగోళ వాతావరణం నెలకొంది . ఇప్పటికైనా అటు పూజారి తనపై వస్తున్న ఆరోపణలతో ప్రధాన పూజారిగా వైదొలగాలని, శివాలయ పరిస్థితులను దేవాలయ అధికారులు సమగ్ర నివేదికను రూపొందించి ఆలయ ప్రతిష్టను కాపాడే భక్తుల మనోభావాలను గౌరవించాలని విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ నేతలు కోరుతున్నారు.