14-09-2025 12:06:11 AM
‘రోజుకు ముప్పు నలభై మందితో పడుకోవాలి. ఎందుకంటే ఒక్కరితో పడుకుంటే ఇచ్చే కూలి కేవలం ఒక్క డాలర్ మాత్రమే’ అంటూ తనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి చెప్తూ బాధపడిపోయింది మృణాల్ ఠాకూర్. తొలుత సీరియల్స్‌లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మృణాల్.. ఆ తర్వాత ‘లవ్ సోనియా’ అనే చిత్రంతో బిగ్‌స్క్రీన్‌కు పరిచయమై, ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతోంది.
ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ తన తొలిచిత్రం సమయంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకుంది. “నా మొదటి సినిమాలో నేను బ్రోతల్ సర్వెంట్‌గా కనిపించాను. ఆ సమయంలో ఆ సినిమా కథకు సం బంధించిన వ్యక్తిని కలిశాను. అలాంటి నేపథ్యం ఉన్నవారిని కూడా కొందరిని కలువాల్సి వచ్చింది. అప్పుడు ఓ సెక్స్ వర్కర్ జీవితం గురించి వింటే కన్నీళ్లు ఆగలేదు.
ఆ సెక్స్ వర్కర్ ఇల్లు చిన్నగా ఉండటంతో భర్త, పిల్లలు బెడ్ కింద పడుకుంటే.. అదే టైమ్‌లో ఆమె మరొకరితో బెడ్ మీద సర్వీస్ చేసేదట. ‘కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను ఎవరూ ఆదుకోలేదు. మనల్ని మనమే కాపాడుకోవాలి’ అని ఆ వేశ్య చెప్పింది. జ్వరం.. పీరియడ్స్.. ఇలా ఏ పరిస్థితుల్లో ఉన్నా సర్వీ స్ ఇవ్వాల్సి వచ్చేది. ఒక్కరితో పడుకుంటే వచ్చే కూలీ కేవలం ఒక్క డాలర్ మాత్రమే. అందుకే రోజుకు దాదాపు ముప్పు నలభై మందితో పడుకోవాలి అని ఆ సెక్స్ వర్కర్ చెప్తుంటే ఏడ్చే శాను” అని తెలిపింది.
డొక్కా సీతమ్మ బయోపిక్‌పై టైటిల్ వివాదం
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త డొక్కా సీతమ్మ బయోపిక్‌పై టైటిల్ వివాదం నెలకొంది. డొక్కా సీతమ్మ జీవిత విశేషాలను సినిమాగా రూపొందించే విషయంలో రెండు నిర్మాణ సంస్థల మధ్య వివాదం ఇప్పుడు తార స్థాయికి చేరింది. ఈ విషయమై వీఎన్‌ఆర్ ఫిలింస్ సంస్థ తాజాగా స్పందించింది. ఈ మేరకు శనివారం మేకర్స్ ఒక ప్రకటన విడుదల చేశారు. “అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’ టైటిల్‌తో మా వీఎన్‌ఆర్ ఫిలింస్ సంస్థ బయోపిక్‌ను నిర్మిస్తోంది.
ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. ఈ బయోపిక్‌కు ఏఆర్‌బీ నిర్మాతగా వ్యవహరిస్తుం డగా, అచ్చర్త రాజుబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ‘అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ బయోపిక్’ టైటిల్‌ను మేము ఫిలింఛాంబర్‌లో రిజిస్టర్ చేయించాం. కాబట్టి ‘అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ బయోపిక్’ టైటిల్ హక్కులు మాకే సొంతం.
ఎలాంటి టైటిల్ రిజిస్ట్రేషన్ లేకుండా ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’ టైటిల్‌తో ఉషారాణి మూవీస్ బ్యానర్‌లో వల్లూరి రాంబాబు నిర్మాతగా, రవి నారాయణ్ దర్శకుడిగా సినిమా రూపొందిస్తున్నారు. ఆ చిత్ర దర్శకుడు రవి నారాయణ్ మమ్మల్ని గత ఏడాది టైటిల్ ఇవ్వమని అడిగారు.
మేము సినిమా చేస్తున్నాం కాబట్టి కుదరదని చెప్పాం. అయినా కూడా మా అనుమతి లేకుండానే ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’ టైటిల్‌తో సినిమా షూటింగ్ చేస్తున్నారు. మాకు చెందిన టైటిల్‌తో ఎవరు సినిమా రూపొందించినా చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. ఉషారాణి మూవీస్‌పై చర్యలకు ఉపక్రమిస్తున్నాం” అని ప్రకటన లో పేర్కొన్నారు.