29-09-2025 12:00:00 AM
ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
ఆలేరు, సెప్టెంబర్ 28 (విజయ క్రాంతి) : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం రాఘవపురం గ్రామంలో దండ్ల నరేష్ చందన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఐలయ్య మాట్లాడుతూ లబ్ధిదారులకు ఇచ్చిన మాట ప్రకారం పట్టుబట్టలు, యటాను అందజేశారు. నియోజకవర్గంలో త్వరితగతిన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసుకోవాలన్నారు. రెండో విడతలో మరో కొంత నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.