29-01-2026 12:22:45 AM
పార్టీలోకి వస్తే బీఫామ్ నీకే అంటున్న పార్టీలు
ఆఫర్ స్తున్న పార్టీలు, తేల్చుకోలేని అభ్యర్థులు
టికెట్ కోసం ఆశవహూల తహతహ నామినేషన్ల సందడి షురూ
కామారెడ్డి, జనవరి 28 (విజయక్రాంతి): గెలుపు గుర్రాల కోసం పార్టీలు అన్వేషిస్తున్నాయి. గెలిచే అభ్యర్థులు ఉంటే ఏ పార్టీలో ఉన్న తమ పార్టీలోకి వస్తే బీఫామ్ తమ వీకే ఇస్తామంటూ పార్టీలు ఆఫర్ పెడుతున్నాయి. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి ఎల్లారెడ్డి బాన్సువాడ బిచ్కుంద మున్సిపాలిటీలో అభ్యర్థుల సందడి నెలకొంది. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన ఆశావాహులు మున్సిపల్ కార్యాలయాలకు తమ అనుచరులతో వచ్చి నామినేషన్లు షురూ చేశారు. దీంతో మున్సిపాలిటీలు సందడిగా మారాయి.
గెలుపు గుర్రాల కోసం వేట
మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ కౌన్సిలర్లు గెలిస్తే మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవచ్చనే ఉద్దేశంతో అధికార పార్టీ కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష పార్టీలైన బి ఆర్ ఎస్, బిజెపి పార్టీలు నేతలు వార్డులలో ఇతర పార్టీలలో ఉన్న వారిని సైతం గెలిచే అవకాశం ఉన్నవారికి తమ పార్టీ బీఫామ్ ఇస్తామని తమ పార్టీలోకి రావడమే ఆలస్యం బీఫామ్ తో పాటు నామినేషన్ వేయండి అంటూ అభ్యర్థులకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.
అసలే రిజర్వేషన్లు కలిసి వచ్చిన వారికి ఏ పార్టీ నుంచి పోటీ చేయాలి అనే సందిగ్ధంలో పలువురు అభ్యర్థులు ఉన్నారు. అసలే మూడు రోజుల సమయమే నామినేషన్లు వేసేందుకు ఉండడంతో తమ పార్టీలో నీ వారు బీఫామ్ ఇవ్వకుంటే మీ పార్టీ తరపున పోటీ చేస్తా ప్లీజ్ అంటూ కొందరు ఆశావాహులు ఆఫర్ ఇచ్చిన పార్టీల నేతలకు వేడుకుంటున్నారు. కాంగ్రెస్ బిజెపి టిఆర్‌ఎస్ పార్టీల నేతలు మాత్రం గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చి తమ పార్టీ అభ్యర్థి గా గెలిపించి మున్సిపల్ పీఠాన్ని తమ పార్టీ ఖాతాలో వేసుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు.
అభ్యర్థులకు పార్టీల ఆఫర్ అక్కడ బీఫాం రాదు ఈ పార్టీ లోకి వస్తే బి ఫామ్ నీకే అంటూ ఆఫర్ పెడుతున్నారూ..
జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రాల కోసం వేట షురూ చేసింది. ప్రతిపక్ష పార్టీలో ఉండి గెలుస్తారు అని భావిస్తున్న వారికి అధికార పార్టీ నేతలు తమ అనుచరులతో ఆపర్ పెడుతున్నారు. ప్రతిపక్ష బి ఆర్ ఎస్, బిజెపి పార్టీల నేతలు సైతం తమ పార్టీలోకి వస్తే మీకే బీఫామ్ అంటూ ఆఫర్ పెడుతున్నాయి. దీంతో గెలుపు కోసం ఆశిస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులు చైర్మన్ అభ్యర్థులు ఏ పార్టీలోకి వెళ్లాలి ఏ పార్టీ నుంచి పోటీ చేయాలి అవకాశం ఏ విధంగా కలిసి వస్తుందని ఆలోచిస్తున్నారు.
నామినేషన్ల ప్రక్రియ షురూ
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను ప్రభుత్వం షురూ చేయడంతో మొదటి రోజు బుధవారం ఆశావాహులు నామినేషన్లు వేయడం చేశారు. కామారెడ్డి ఎల్లారెడ్డి బాన్సువాడ బిచ్కుంద మున్సిపాలిటీలలో ఐదు గంటల వరకే సమయం గడువు ఉండడంతో సర్టిఫికెట్ల కోసం తంటాలు పడి తెచ్చుకొని నామినేషన్లు వేశారు. మరో రెండు రోజులు మాత్రమే నామినేషన్లు అవకాశం ఉండడంతో పోటీ చేస్తాం అనుకున్నా ఆశావాహులు పార్టీ బీఫామ్ తర్వాత ఆలోచించొచ్చు ప్రస్తుతం నామినేషన్ మాత్రం వేసేద్దాం అంటూ నామినేషన్ వేయడం ఆశవాహూలు షురూ చేశారు.
దీంతో జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపల్ కార్యాలయాలు సందడిగా మారాయి. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేయడంతో ఆశావాహులు నామినేషన్ వేసేందుకు తమ అనుచరులతో వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు.
ఇంటి పనులు చెల్లింపు
నామినేషన్ వేసేందుకు ఇద్దరు బలపరచాల్సి ఉండడంతో వారి ఇంటి టాక్స్ చెల్లించేందుకు అభ్యర్థులతో పాటు బలపరిచే అభ్యర్థుల ఇంటి, కులాయి టాక్స్ లను చెల్లిస్తున్నారు.
సలహా కేంద్రాలు ఏర్పాటు
మున్సిపల్ కార్యాలయాల్లో నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థు లు ఏ ఏ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది, అన్న వివరాలు తెలిపేందుకు ప్రతి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో సలహా కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు నామినేషన్ల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.
ఆయా మున్సిపల్ కమిషనర్లు సైతం మున్సిపల్ ఎన్నికల కు ఏర్పాట్లు పూర్తి చేసి పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కు మున్సిపల్ ఎన్నికల పర్యవేక్షణకు సాధారణ పర్యవేక్షకులను సైతం ప్రభుత్వం నియమించింది.