calender_icon.png 29 January, 2026 | 3:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బదిలీలు నిలిపివేయండి

29-01-2026 12:00:00 AM

  1. మింట్ కాంపౌండ్ ధర్నాలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్
  2. విద్యుత్ అధికారులతో ఉద్యోగుల జేఏసీ చర్చలు విఫలం
  3. రిలేదీక్షలు, నల్ల బ్యాడ్జీలతో నిరసన కొనసాగించాలని నిర్ణయం
  4. పాత విధానంలోనే ఉద్యోగులకు స్థానచలనం కల్పించాలి
  5. బదిలీకి కనీస సర్వీస్ మూడేళ్లకు సవరించాలి
  6. బదిలీల్లో యాజమాన్యాల ఒంటెద్దు పోకడపై ఆగ్రహం

ఖైరతాబాద్, జనవరి 28(విజయక్రాంతి): విద్యుత్ శాఖలో ప్రస్తుతం కొనసాగుతున్న బదిలీల ప్రక్రియను నిలిపివేయాలని విద్యు త్ ఉద్యోగుల ఐక్య వేదిక (జేఏసీ) దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థను డిమాండ్ చేసింది. మింట్ కాంపౌండ్‌లో బుధవారం ఈ మేరకు ఐక్య వేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తర్వాత ఎర్ర గడ్డలోని విద్యుత్ సంస్థలో యాజమాన్యం తో జరిగిన చర్చలు జరిపారు. ఆ చర్చలు విఫలమైనట్లు ఉద్యోగుల జేఏసీ నాయకులు తెలిపారు.

తమ డిమాండ్లకు యాజమాన్యం నుంచి సరైన హామీ లభించలేదని తెలిపారు. దీంతో  రేపటి నుంచి మింట్ కాంపౌండ్ ఆఫీసుతో పాటు జిల్లా కేంద్రాల్లోనూ రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని ఉద్యోగులకు పిలుపుని చ్చారు. ప్రతిసారీ అమలు చేస్తున్న విధానంలోనే బదిలీ ప్రక్రియ చేపట్టాలని, బదిలీకి కనీస సర్వీస్ మూడేళ్లకు సవరించాలని టీఈఈ జేఏసీ, టీజీపీఈ జేఏసీ కోరాయి. 

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలోని విద్యుత్ సంస్థ యాజమాన్యాలు మొండి వైఖరిని అవలంబిస్తున్నాయని విమర్శించారు. బదిలీల విషయంలో ఒంటెద్దు పోకడలకు పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పవ ర్ ఇంజనీర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ సాయిబాబు, తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ జాన్సన్, కన్వీనర్లు రత్నాకర్, శివాజీ, జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు శ్రీధర్,బీసీ రెడ్డి, సుమారు పది వేల మంది ఉద్యోగులు పాల్గొన్నారు.