calender_icon.png 25 August, 2025 | 7:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీ కార్యాలయం... దేవాలయం

25-08-2025 01:11:13 AM

టిపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 

మేడ్చల్, ఆగస్టు 24(విజయ క్రాంతి): పార్టీ కార్యాలయం దేవాలయం వంటిదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం మేడ్చల్ లో జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం, ఎల్ సి డి ప్రచార వాహనాలను ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ పేద ప్రజలు తమకు అవసరమైన వాటికోసం దరఖాస్తులు పార్టీ కార్యాలయంలో అందించాలన్నారు.

దరఖాస్తుదారుల సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటు చోరీ అంశంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి డీసిసి అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి 5 ఎల్ సి డి ప్రచార వాహనాలను సమకూర్చారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో వాహనం కేటాయించారు. వాహనాల సమకూర్చిన హరి వర్ధన్ రెడ్డిని ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ అభినందించారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్, కుతుబుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్ నియోజకవర్గాల ఇన్చార్జిలు వజ్రేస్ యాదవ్, కొలను హనుమంత రెడ్డి, బండి రమేష్, పరమేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎం సుధీర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి, సత్యం శ్రీరంగం, పీసరి మహిపాల్ రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్, గ్రంథాలయ చైర్మన్ బొంగునూరు శ్రీనివాసరెడ్డి, మేడ్చల్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మర్రి దీపికా నరసింహారెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు వేముల శ్రీనివాసరెడ్డి, గౌడవెల్లి రమణారెడ్డి, రామన్న గారి మణికంఠ, గువ్వ రవి, ఉదండపురం సత్యనారాయణ, కౌడే మహేష్, చాపరాజు, దుర్గం శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.