calender_icon.png 14 November, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతిని ఏకీకృతం చేయడంలో పటేల్ పాత్ర మరువలేనిది

14-11-2025 01:30:44 AM

సూర్యాపేట, నవంబర్ 13 (విజయక్రాంతి):  జాతీయ సమైక్యత, దేశభక్తి ని పెంపొందించడం, ప్రత్యేకించి జాతిని ఏకీకృతం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర మరువలేనిధని ఎంపీ, రాజ్యసభ సభ్యులు  కె. దేవ్ సినా జ్వాల అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి ని పురస్కరించుకొని ప్రజలలో జాతీయ సమైక్యతను, దేశభక్తిని పెంపొందించేందుకుగాను కేంద్ర యువజన వ్యవహారాలు,  క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో  మై భారత్, ఎన్‌ఎస్‌ఎస్ సహకారంతో  గురువారం జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోఏర్పాటు చేసిన “సర్దార్ 150 యూనిట్ మార్చ్‌” ను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఆయన  మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పూర్తితో జాతి నిర్మాణంలో యువతను ప్రోత్సహించడం, యువత ఆలోచనలను ఆచరణలో పెట్టి దేశ అభివృద్ధికి కృషి చేయాలని  పిలుపునిచ్చారు.  ముందుగా పటేల్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కే.సీతారామారావు, సూర్యాపేట ఆర్డీవో వేణు మాధవ్,  డీఎస్పీ ప్రసన్నకుమార్, జిల్లా క్రీడల యువజన శాఖ అధికారి వెంకట్ రెడ్డి,  తహసీల్దార్ కృష్ణయ్య, మహబూబాబాద్, యూత్ కో-ఆర్డినేటర్ రాజేష్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి, విద్యార్థులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.