14-11-2025 01:31:29 AM
పాల్గొననున్న- 40 దేశాల ప్రతినిధులు
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 13 (విజయ క్రాంతి):వేములవాడ మున్సిపల్ కార్యాలయం వద్ద సిపిఐ పార్టీ వంద సంవత్సరాల ముగింపు సభ, ఖమ్మం జిల్లాలో డిసెంబర్ 26 న జరిగే కరప త్రం ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ కడారి. రాములు, ముఖ్య అతిధి సిపిఐ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద. సుదర్శన్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ ఈ నెల 16-17 తేదీలలో వేములవాడ కు వస్తున్న సిపిఐ పార్టీ బస్సు జాతాకు కార్మికులు, పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజవంతం చేయాలని, వంద సంవత్సరాల సుదీర్ఘ కాలంలో వేలాది ఎకరాల భూములు పంచిన ఘన చరిత్ర సిబిఐ పార్టీ దని, పేదల హక్కుల కోసం నిరంతరం పాటుపడే పార్టీ అని, ఈ ర్యాలీ లో పాల్గొంటు, బహిరంగ సభను విజయవంతం చేయాలని, ఈ ర్యాలీ లో ముఖ్య అతిధిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కామ్రేడ్ కూనంనేని, మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ చాడా పాల్గొంటారు. ముగింపు సభలో 40 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు.
ఈ కార్యక్రమం లో పట్టణ కార్యదర్శి ఎల్ల. దేవరాజు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు అనసూర్య, వేములవాడ రూరల్ మండల కార్యదర్శి శ్రీరాముల. నర్సయ్య, పెంట. మల్లయ్య, వావిలాల. నర్సయ్య, గూడెం. కనకయ్య, మహేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.