20-11-2025 01:00:56 AM
ప్రారంభించిన ఫ్యాషనిస్టా కోయల్ చందక్
హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్ 1లో గల లేబుల్స్ పాప్-అప్ స్పేస్‌లో ఏర్పాటైన డి సన్స్ పటోలా ఆర్ట్స్ వస్త్ర ప్రదర్శనను నగర సోషలైట్, ఫ్యాషనిస్టా కోయల్ చందక్ బుధవారం ప్రారంభించారు. ‘ఉత్తమమైన, విభిన్నమైన పటోలా ఆర్ట్ చీరలు, పటోలా హ్యాండ్లూమ్, సిల్క్ వస్త్రో త్పత్తులను ఒకే వేదికలో ప్రదర్శించడం అభినందనీయమని ఆమె అన్నారు.
నేరుగా వీవర్ నుంచి వినియోగదారునికి అందించేందుకు ఏర్పాటైన ఈ ప్రదర్శన ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని కోయల్ చందక్ కోరారు. డి సన్స్ పటోలా ఆర్ట్స్ నిర్వాహకులు మాట్లాడుతూ.. ఈ నెల 23 వరకు కొనసాగుతున్న ప్రదర్శనలో సాంప్రదాయ వస్త్రాలు, చేతితో తయారు చేసిన ప్రత్యేక వస్త్రోత్పుల కలెక్షన్ వేదికగా పటాన్ పటోలా, బంధాని, బనారసి, పైథాని, కాశ్మీరీ, మహేశ్వరి, కాంచీపురం, గద్వాల్, లక్నోవి, అజ్రాక్ చీరలు, సూట్లు, కుర్తీలు, డ్రెస్ మెటీరియల్, ఆభరణాలు, బెడ్షీట్లు వంటి ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయన్నారు. నేత కార్మికులను ప్రోత్సహించ డంతో పాటు చేనేత పరిశ్రమకు మార్కెట్ను అందించడమే ఈ ఎగ్జిబిషన్ ప్రధాన సామాజిక లక్ష్యం అని ఆయన తెలిపారు.