calender_icon.png 23 October, 2025 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్న కాంట్రాక్టుల పెండింగ్ బిల్లును చెల్లించండి

23-10-2025 12:24:54 AM

ఆర్ అండ్ బీ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన

తెలంగాణ సివిల్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్

ఖైరతాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న చిన్న కాంట్రాక్టర్ల బిల్లులను తక్షణమే చెల్లించాలని తెలంగాణ సివిల్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (టిసిసిడబ్ల్యూఎ) రాష్ట్ర అధ్యక్షులు దర్శనాల శంకరయ్య విజ్ఞప్తి చేశారు. రెండేళ్లుగా బిల్లులు రాళపోవడం కాంట్రాక్టర్ల కుటుంబాలు ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికే అనేకమంది మానససిక క్షోభకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. కాంట్రాక్టర్ల బిల్లులు మెయింటెన్స్లు బిల్లులు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఖైరతాబాద్‌లోని ఆర్ అండ్ బి కార్యాలయం ముందు అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్న కాంట్రాక్టర్లు దర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా శంకరయ్య మాట్లాడుతూ..  కాంట్రాక్టర్ల బిల్లులు, మెయింటె నెన్స్ బిల్లులు ఇవ్వాలని ఆర్ అండ్ బి డిపార్టుమెంట్ కు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఒక్క పేమెంట్ కూడా చేయలేదన్నారు.

బిల్లులు చెల్లించకపోగా, కొత్తగా పాత మెయింటెనెన్స్ చేసిన రోడ్ల మీద తిరిగి టెండర్లు పిలిచేందుకు ఆర్ అండ్ బి సిద్ధమవుతున్నదని తెలిపారు. కాంట్రాక్టర్లను మోసం చేసే నిర్లక్ష్య వైఖరిని వీడనాడాలని కోరారు. తమ పాత బిల్లులు చెల్లించిన తర్వాతనే కొత్త టెండర్లు పిలువాలని డిమాండ్ చేశారు. ఆర్ అండ్ బి నిర్వాకం వల్ల కొంతమంది కాంట్రాక్టర్లు రోడ్డు మీద పడ్డారని, మిగతా కాంట్రాక్టర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైందని పేర్కొన్నారు.

అనంతరం ఆర్ అండ్ బి ఉన్నతాధికారికి వినతిపత్రం అందజేశారు. ఇకనై నా పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించి తమ కు న్యాయం చేయాలని వేడుకొన్నారు. సమావేశంలో అసోసియేషన్ ముఖ్య సలహాదారులు కొప్పుల బజయ్ కుమార్, ఉపాధ్యక్షులు చిందం శ్రీనివాస్, కాంట్రాక్టర్లు రామగౌడ్, బద్దం హనుమం తరరెడ్డి (సిరిసిల్ల), శ్రీనివాస్ రెడ్డి (వేములవాడ), గూడూరి నర్సయ్య (పెద్దపల్లి), బానోత్ దర్సింగ్ (సిరిసిల్ల), నారాయ ణరెడ్డి (కామారెడ్డి) తదితరులు పాల్గొన్నారు.