calender_icon.png 5 July, 2025 | 6:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టండి’

05-07-2025 12:26:43 AM

కందుకూరు,జూలై 4 : సీజన్ వ్యాధులు సోకకుండా పంచాయతీల్లో పారిశుద్ధంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. శుక్రవారం మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్, ఎంపీడీవో సరిత ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల ధికారులతో స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ అభియోగ్ కార్యక్రమంలో భాగంగా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,వాతావరణంలో మార్పులు,చేర్పులు రోజురోజుకు దినదిన గండంగా మారి పర్యావరణం కాలుష్యం అవుతుందని,దీనివల్ల వర్షాలు సమృద్ధిగా కురవలెకపొతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణాన్ని పరీక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని పిలుపు నిచ్చారు. పంచాయతి అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ (పిఏఐ)ద్వారా గ్రామ పంచాయతీలకు అవార్డులు వచ్చేలా పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెస్‌ఓ సుధారాణి,డిఎల్పిఓ లక్ష్మీనారాయణ, ఎంపిఓ గీత,ఏపీఓ రవీందర్ రెడ్డిలు పాల్గొన్నారు.