31-12-2025 01:21:46 AM
ఇల్లందు టౌన్, డిసెంబర్ 30, (విజయక్రాంతి): వరంగల్ కేంద్రంలో జనవరి 5, 6, 7 తేదీలలో జరగనున్న పి.డి.ఎస్.యు తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ మంగళవారం ఇల్లందులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర మహాసభల గోడపత్రికను ఆవి ష్కరిం చారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్. యు జిల్లా నాయకులు గణేష్ పాల్గొని మా ట్లాడు తూ 50 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన పిడిఎస్ యు 23వ రాష్ట్ర మహాసభలు వరంగల్ కేంద్రంగా నిర్వహించబడనున్నాయని తెలిపారు.
జార్జి రెడ్డి ప్రేరణతో, జె.సి. ఏస్. ప్రసాద్ నాయకత్వంలో ఏర్పడిన పిడిఎస్ యు ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా అనేక విద్యార్థి ఉద్యమాలను నిర్వహిస్తూ శాస్త్రీయ విద్య సాధన, సమ సమాజ స్థాపన లక్ష్యంగా ముందుకు సాగిందన్నారు. ఈ ఉద్యమంలో భాగంగా జంపాల, శ్రీపాద శ్రీహరి, కోలా శంకర్, రంగవల్లి, చేరాలు, రమణయ్య, సాం బయ్య, మధుసూదన్ రాజ్ యాదవ్ వంటి అనేక మంది విద్యార్థి వీరులు తమ ప్రాణాలను విద్యార్థి ఉద్యమానికి అర్పించారని గుర్తు చేశారు. ప్రస్తుత దేశ పరిస్థితులపై మాట్లాడుతూ, కేంద్రంలోని మోడీ ప్రభు త్వం హిందుత్వ బ్రాహ్మణీయ పార్లమెంటరీ ఫాసిజాన్ని అమలు చేస్తూ లౌకిక గణతంత్ర దేశాన్ని హిందూ దేశంగా మార్చే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు.
అందులో భాగంగానే విద్యను కాషాయీకరణ చేయ డం, కార్పొరేటీకరణ చేయడం జరుగుతోందని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా విద్యను సంతలో సరుకులా మార్చి పేద విద్యార్థులను చదువుల నుంచి దూరం చేసే పరిస్థితిని సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విద్యా వ్యతిరేక విధానాల ను ఎదుర్కొనేందుకు విద్యార్థి లోకం పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ ప్రత్యేక సందర్భంలో జరగబోయే పి.డి.ఎస్. యు తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ నరసింహ, అఖిల్, రామ్ చరణ్, ఆయుష్, గంగోత్రి, అంజలి తదితరులు పాల్గొన్నారు.