calender_icon.png 31 December, 2025 | 7:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయ పనులతో అభివృద్ధికి శ్రీకారం

31-12-2025 01:19:57 AM

బూర్గంపాడు,డిసెంబర్30,(విజయక్రాంతి): రామాలయ పనులతో టేకులచె రువు గ్రామ పంచాయతీలో అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు టేకుల చెరువు సర్పంచ్ బోళ్ళ సైదమ్మ అన్నారు. మంగళవారం గ్రా మంలోని రామాలయ ప్రహరీ గోడ పనులను సర్పంచ్ బోళ్ళ సైదమ్మ, ఉప సర్పంచ్ ఇస్లావత్ రవి లు భూమి పూజ చేసి పనులకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా స ర్పంచ్ సైదమ్మ మాట్లాడుతూ పంచాయతీ పరిధిలోని కాలనీలలో దశలవారీగా అభివృద్ధి పనులు చేపడతామని అన్నారు.

తమ కు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల రుణం తీర్చు కునేందుకు గ్రామంలోని అభివృద్ధి ప నులు చేపడతామని అన్నారు. ఎన్నికలు ము గిసిన తర్వాత పార్టీలకతీతంగా, రాజకీయాలకతీ తంగా గ్రామ అభివృద్ధే ధ్యేయంగా తమ పాలక మండలి పనిచేస్తుందని ఆమె పేర్కొన్నారు. గ్రామంలోని ఎనిమిది వార్డులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ ముందున్న లక్ష్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ ఇస్లావత్ రవి, వార్డు సభ్యులు బోళ్ళ శ్రీశైలం, కాకా రాఘవమ్మ, లావూడియా వీరన్న, తేజా వత్ కుఫ్రీయా, గ్రామ పెద్దలు పాండవుల రామానాధం, బుర్ర వెంకన్న,రాము, ఉపేందర్, జక్కుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.