calender_icon.png 31 August, 2025 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తి మార్గంతోనే శాంతి, సౌభ్రాతృత్వం

30-08-2025 09:21:16 PM

మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాస రావు 

మంచిర్యాల, (విజయక్రాంతి): భక్తి మార్గంతోనే సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొంటుందని మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాస రావు(RDO Srinivasa Rao) అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని వంద ఫీట్ల రోడ్డులో గల అంజనీ పుత్ర సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన గణ నాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. సమాజంలో ప్రతీ ఒక్కరూ భక్తి మార్గంలో పయనించి సమాజంలో మార్పు తీసుకురావాలని ఆకాంక్షించారు. సమాజ సేవ కోసం శక్తి వంచన లేకుండా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.  అనంతరం అంజనీ పుత్ర సంస్థ చైర్మెన్ గుర్రాల శ్రీధర్, మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవిలతో కలిసి భక్తులకు ప్రసాదం వడ్డించి అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంజనీ పుత్ర సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లు సూరినేని కిషన్, కాసర్ల సదానందం, డైరెక్టర్ లు, సంస్థ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.