calender_icon.png 1 September, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంజీరా పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండండి

30-08-2025 09:23:29 PM

పాపన్నపేట: ఎగువ ప్రాంతాల నుంచి లక్ష క్యూసెక్కుల వరద నీరు రావడం జరుగుతుందని మంజీరా నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. మహారాష్ట్ర, కర్ణాటక నుండి పెద్ద ఎత్తున వరద నీరు సింగూర్ ప్రాజెక్టు లోనికి వస్తుండడంతో లక్ష క్యూసెక్కుల నీరుని దిగివకు వదలడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. మంజీరా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. 

పెద్ద ఎత్తున వరద నీరు చేరడం వల్ల వరద ఉధృతి ఎక్కువగా ఉంటుందని ప్రజలు ఎవరూ కూడా ఆ ప్రాంతాలకు వెళ్లకుండా అధికారులు అప్రమత్తం చేయాలని పశువుల కాపరులు, జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దని, అప్రమత్తతే ఆయుధంగా ప్రజలు గుర్తించి అధికారులకు సహకరించాలన్నారు. ఈ సందర్బంగా ఏడుపాయల ఆలయం వద్ద వరద ఉదృతిని ఆయన అధికారులతో కలిసి పరిశీలన చేశారు. ప్రజలు ఎవరినీ ప్రాజెక్టు మరియు నది పాయల పరిసర ప్రాంతాల వైపు వెళ్లకుండా చూడాలని అధికారులకు సూచించారు.