05-07-2025 08:39:34 PM
తీవ్ర ఉత్కంఠ నడుమ సాగిన పిఎసిఎస్ చైర్మన్ ఎన్నిక..
తన ఎన్నికకు సహకరించిన మంత్రి ఉత్తమ్ కు ప్రత్యేక ధన్యవాదాలు..
సర్వారం పిఎసిఎస్ నూతన చైర్మన్ ముత్యాలు గౌడ్..
హుజూర్ నగర్/గరిడేపల్లి: రైతుల అభివృద్ధి కోసం విశేష కృషి చేస్తానని సర్వారం పిఎసిఎస్(PACS) నూతన చైర్మన్ ముత్యాలు గౌడ్ అన్నారు. శనివారం గరిడేపల్లి మండలంలోని సర్వారం సహకార సంఘం నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించారు. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని సర్వారం సింగిల్ విండోకు అనధికారిక పాలకవర్గాన్ని నియమిస్తున్నట్టు జిల్లా సహకార సంఘం అధికారి పద్మ ప్రత్యేక ఆదేశాలతో కూడిన ఉత్తర్వులను అందజేశారు. ప్రస్తుతం చైర్మన్ గా వ్యవహరిస్తున్న అసిస్టెంట్ రిజిస్టార్ కమల ఆధ్వర్యంలో నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మొత్తం పాలకవర్గం 10 మంది సభ్యులతో ఏర్పాటు చేయడం జరిగిందని దీనిలో సంఘం చైర్మన్ గా ముత్యాలు గౌడ్, వైస్ చైర్మన్ తో పాటు మిగిలిన ఎనిమిది మంది సభ్యులు బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా నూతన చైర్మన్ గా ఎన్నికైన పెండెం ముత్యాల గౌడ్ మాట్లాడుతూ.. తనకు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ రైతులకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తానని ఆయన తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన మంత్రి ఉత్తమ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సంఘం అభివృద్ధికి రైతుల ప్రయోజనాల కోసం కృషి చేస్తానని తెలిపారు. పాలకవర్గంలో వైస్ చైర్మన్ గా గుమ్మడవెల్లి కృష్ణకుమారి, సభ్యులుగా దొంతగాని ఎల్లయ్య, మీసాల యోహాన్, మూలగుండ్ల సుధాకర్ రెడ్డి, కొత్త చంద్రారెడ్డి, ఎడవెల్లి వెంకటరెడ్డి, పెండెం కోటేశ్వరరావు, గట్టి కొప్పుల లక్ష్మారెడ్డి, బానోతు రమేష్ లు పాలకవర్గం బాధ్యతలు తీసుకున్నారు.
దీంతో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు త్రిపురం అంజన్ రెడ్డి, మాజీ ఎంపీపీలు పైడిమర్రి రంగనాథ్, కటకం ఆశా రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్లు సీతారామరెడ్డి, గుండు రామాంజీ గౌడ్, మాజీ జెడ్పిటిసి పెండెం శ్రీనివాస్ గౌడ్, సహకార బ్యాంక్ కమిటీ సభ్యులకు, మాజీ ఎంపీటీసీలకు, సర్పంచులకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం అధికారులు, కార్యదర్శి గోపి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.