calender_icon.png 6 July, 2025 | 1:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం సహాయనిధి ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు

05-07-2025 08:39:59 PM

భూపాలపల్లి, రేగొండ, చిట్యాలలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే జీఎస్సార్

చిట్యాల,(విజయక్రాంతి): సీఎం సహాయనిధి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.శనివారం భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం,రేగొండ మండలకేంద్రంలోని రైతు వేదిక, చిట్యాల మండలకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన 191 మంది లబ్ధిదారులకు రూ.61,10,500/- సీఏం సహాయనిది చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా వేరువేరుగా నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ... అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే  ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు.

సీఎం సహాయనిధి ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు.మానవతాదృక్పథంతో సీఎం రేవంత్ రెడ్డి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ప్రైవేటు, కార్పోరేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్య చికిత్స చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆసరగా నిలుస్తుందన్నారు. బాధితులకు అవసరమైన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ను తప్పక సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా సూచించారు.