calender_icon.png 4 August, 2025 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేద్దాం

03-08-2025 11:14:17 PM

ఏటూరునాగారం,(విజయక్రాంతి): ఆగస్టు 9వ తారీకున నిర్వహించే ఆదివాసీ ప్రపంచ దినోత్సవాన్ని విజయవంతం చేద్దామని తుడుం దెబ్బ ములుగు డివిజన్ అధ్యక్షుడు పొడెం శోభన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తుడుం దెబ్బ ములుగు డివిజన్ అధ్యక్షుడు పొడెం శోభన్ మాట్లాడుతూ... రాష్ట్రంలోని ప్రతి ఆదివాసి గూడెం, పట్టణంలో యువతి, యువకులు, మహిళలు,ఉద్యోగులు, గ్రామస్తులు, ప్రజాప్రతి నిధులు పార్టీలకు అతీతంగా తమ గ్రామంలో ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవ జెండా ఎగరవేయాలని ఆదివాసీల హక్కులు, చట్టాలు, సాంసృతి సంప్రదాయాల కోసం పోరాడి అమరులైన ఆదివాసీ పోరాట యోధులను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.

అన్ని మండల, కేంద్రాలలో భారీ ఎత్తున కొమ్ము కోయ,గుస్సాడి, దీంసా ఆదివాసీ సంప్రదాయ నృత్యాలతో ర్యాలీ అనంతరం కొమురం భీం విగ్రహం వద్ద జెండా ఆవిష్కరణ అనంతరం సభలు,సమావేశాలు,నిర్వహించు కోవాలన్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి రూ.20 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా సభలు, సమావేశాలు నిర్వహించి అంతర్జాతీయంగా ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలైన విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, భూమి, సంస్కృతి, సంప్రదాయ హక్కుల పరిరక్షణ వంటి అంశాలు విశ్లేషించి అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం ప్రపంచ ఆదివాసి దినోత్సవ కార్యక్రమాలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.