24-01-2026 01:03:21 AM
న్యూయార్క్, జనవరి 23: ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ కంపెనీ పరిధలో ఖర్చులు తగ్గించుకునేందుకు లేఆఫ్స్‌కు సిద్ధమైంది. ఈ నెల ౨౭న ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 16,000 మందికి ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధం చేసింది. ఈసారి అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఈడబ్ల్యూఎస్), ప్రైమ్ వీడియో, రిటైల్ ఆపరేషన్స్, హెచ్‌ఆర్ విభాగంలోని పీపుల్ ఎక్స్పీరియన్స్ అండ్ టెక్నాలజీ (పీఎక్స్‌టీ)లో పెద్దఎత్తున తొలగింపులు ఉండవచ్చని నిపుణులు చెప్తున్నారు. కంపెనీ పరిధిలో పనిచేస్తున్న మొత్తం ౩౦,౦౦౦ మంది ఉద్యోగాలను తొలగించాలని యాజమాన్యం నిర్ణయించింది.
దీనిలో భాగంగానే గతేడాది అక్టోబర్‌లో 14,000 ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. మరో ౧౬,౦౦౦ మందిని వచ్చే మంగళవారం తొలగించనున్నది. ఈ తొలగింపు ప్రక్రియ పూర్తయితే 2023లో 27,000 ఉద్యోగాల కోత రికార్డును కంపెనీ అధిగమించనుంది. కంపెనీ తీసుకున్న నిర్ణయం ఒక్క అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులే కాకుండా భారత్‌పైనా ప్రభావం పడనుంది. కంపెనీలో అవసరానికి మించి బ్యూరోక్రసీ ఉన్నందునే లేఆఫ్స్ చేపట్టామని అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ స్పష్టం చేశారు. ఈ పరిణామాలపై గ్లోబల్ వ్యాప్తంగా ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా వాపోతున్నారు. ఎవరిపై వేటు పడుతుందో తెలియక సతమతమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారత్‌లోని కంపెనీ ఉద్యోగులదీ ఇదే పరిస్థితి.