calender_icon.png 7 November, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులు అరెస్ట్

07-11-2025 01:18:20 AM

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌లను అభినందించిన డీఎస్పీ

ముస్తాబాద్,నవంబర్ 6(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో గురువారం రోజున మండల ఎస్త్స్ర సిహెచ్ గణేష్ తన సిబ్బందితో బందనకల్ గ్రామ శివారులో తమ సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు టీవీఎస్ ఎక్సెల్ బండ్లపై అనుమానస్పదంగా తిరుగుతుండగా వారిని పట్టుకుని విచారించారు.పర్వతం శ్రీను గ్రామం దుబ్బాక,నూనె సాయికుమార్ లుగా తమ వివరాలను తెలిపినట్లు పోలీసులు తెలిపారు.

వెంటనే స్టేషన్ తరలించారు.పాత ఇనుప సామాన్లు కొనడం,అమ్మడం వలన వచ్చిన డబ్బులు కుటుంబ పోషణకు వారి జల్సాలకు సరిపోవటం లేదని సులువుగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో ఎలక్ట్రికల్ మోటార్లు కరెంటు వైర్లను రాత్రి సమయంలో దొంగలించి అమ్ముకోవాలని నిర్ణయించుకొన్నారు.ఇట్టి విషయాన్ని బడే అనిల్ గ్రామం సంగుపల్లి, గజ్వేల్,మోతె సాయిలుకు చెప్పడంతో దొంగతనం చేయుటకు ఒప్పుకున్నారు.

వీరు నలుగురు కలిసి 2 తేదీన తెర్లుమద్ది శివారులోని అర్జున్ స్టోన్ క్రషర్ లో దొంగతనంగా ప్రవేశించి 3 సెల్ ఫోన్లు ఎత్తుకు వెళ్లారు.అదే రోజు ముస్తాబాద్ శివారులోని శ్రీ తిరుమల రైస్ మిల్ నందు 4 కరెంట్ మోటర్లు,ఆ తరువాత మరల అక్టోబర్ 21 న తెర్లమద్ది లోని అర్జున్ స్టోన్ క్రషర్ లోకి ప్రవేశించి రాత్రి సమయంలో 7 టిప్పర్ బ్యాటరీలు, 1 ట్రాక్టర్ బ్యాటరీ, స్టోన్ కట్టర్ సీజన్ 2, బీటీ లింక్ చైన్లు 2 ఇతర ఐరన్ సామాన్లు ఎత్తుకెళ్లినారని తెలిపారు.

వీటితో పాటుగా ముస్తాబాద్, పోతుగల్, మద్దికుంట,చీకోడ్, మొర్రాపూర్ ఇంకా చాలా గ్రామాలలో వ్యవసాయ బావుల వద్ద గల కరెంటు మోటార్లను ఎత్తుకెళ్లడం జరిగింది. ఎత్తుకెళ్లిన వస్తువులను అమ్మడానికి పర్వతం శీను బాలసంత నూనె సాయికుమార్ అనువారు వారి యొక్క టీవీఎస్ ఎక్సెల్ బండ్ల మీద బందనకల్ కు రాగా వారిని పట్టుకోవడం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.

వారి వద్ద నుండి దొంగలించిన 2 సెల్ ఫోన్లు, 7 టిప్పర్ బ్యాటరీలు, 1 ట్రాక్టర్ బ్యాటరీ, 2 స్టోన్ కట్టర్ సీజిల్, 2 బిటి లింకు చైన్లు, 6 కరెంటు మోటార్లు మొత్తం రికవరీ చేసిన సొత్తు విలువ అందాదగా 4,07,000 రూపాయల విలువ ఉంటుందని సిరిసిల్ల డిఎస్పి కె చంద్రశేఖర్ రెడ్డి ఈ సందర్బంగా తెలిపారు.దొంగతనాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ దొంగతనం చేదించినందుకు గాను ముస్తాబాద్ ఎస్త్స్ర సిహెచ్ గణేష్, కానిస్టేబుల్ సిహెచ్ రాజశేఖర్, టి నరేష్,ఎండి కాసింలను డిఎస్పి అభినందించారు. మిగతా నేరస్తులు పరారీలో ఉన్నారని వారిని కూడా కట్టుకుంటామని  పత్రికా ప్రకటనలో తెలిపారు.