calender_icon.png 7 November, 2025 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రఘునాథపాలెం స్టేషన్‌ను సందర్శించిన ఏసీపీ

07-11-2025 01:18:28 AM

హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా రఘునాథపాలెం పోలీస్ స్టేషన్‌ను ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి గురువారం సందర్శించారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఏసీపీ స్టేషన్ నిర్వహణ, పోలీసుల పనితీరు, సెక్టార్ అధికారుల విచారణ నివేదికలు, జనరల్ డైరీ రికార్డులను పరిశీలించారు. పిటిషన్ విచారణలకు సంబంధించి సిబ్బందితో మాట్లా డారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అయిన కేసులు, డయల్ 100 కాల్స్ ప్రతిస్పందన సమయం, సస్పెక్ట్ షీట్లు, పెండింగ్ కేసులు పరిశీలించారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ.. వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలని అన్నారు. స్టేషన్ హౌస్ మేనేజ్మెంట్, పోలీస్ స్టేషన్ నిర్వహణ, సెక్టార్ ఆఫీసర్ల భాధ్యతలు విధిగా అమలు చేయాలని సూచించారు. పెట్రో కార్, బీట్ డ్యూటీ సిబ్బంది ఏవిధమైన విధులు నిర్వహిస్తున్నారు, పాత నేరస్థుల నివాసాలను కదలికలను ఏవిధంగా గుర్తిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.