02-08-2025 12:00:00 AM
ఎస్పీ కాంతిలాల్ పాటిల్
కాగజ్‌నగర్ ఆగస్టు 1 (విజయక్రాంతి) : ప్రజలకు అందుబాటులో ఉంటూ కేసులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు.శుక్రవారం ఈస్ గాం పోలీస్ స్టేషన్ను డి.ఎస్.పి రామానుజం తో కలసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, కేసుల ప్రోగ్రెస్, సీసీ కెమెరా పర్యవేక్షణ, ఆయుధాల భద్రత, స్టేషన్ పరిశుభ్రత తదితర అంశాలను సవివరంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించచాలన్నారు. ప్రజల్లో న్యాయం పట్ల విశ్వాసం పెంచేలా పని చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.