calender_icon.png 18 August, 2025 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి

24-07-2025 06:48:11 PM

గజ్వేల్ ఏసీపీ నర్సింహులు..

దౌల్తాబాద్: సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని గజ్వేల్ ఏసీపీ నర్సింహులు(ACP Narsimhulu) అన్నారు. గురువారం రాయపోల్ పోలీస్ స్టేషన్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. రోజువారి విధులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని విధులను సమర్ధవంతంగా చేపట్టాలన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలని స్టేషన్కు వచ్చే ప్రతి దరఖాస్తు దారునితో మాట్లాడి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని అన్నారు. సీజ్ చేసిన వాహనాలను సంబంధిత వాహన యజమానులకు త్వరగా అందజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తొగుట సీఐ లతీఫ్, ఎస్సై మానస, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.