calender_icon.png 16 October, 2025 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్థివదేహాల దానానికి ముందుకు రావాలి

16-10-2025 02:34:11 AM

మేడ్చల్, అక్టోబర్ 15(విజయ క్రాంతి): మెడికల్ కాలేజీలకు పార్థివదేహాల దానానికి కుటుంబ సభ్యులు ముందుకు రావాలని మెడిసిటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కే శివరామకృష్ణ అన్నారు. వరల్డ్ ఆనాటమీ డే సందర్భంగా మెడిసిటి కాలేజీలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు శరీర భాగాల నిర్మాణంపై వివరించడానికి పార్టీవదేహాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.

స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు గంజి ఈశ్వర లింగం శారద మాట్లాడుతూ పార్థివ దేహాల కొరత వల్ల వైద్య విద్యార్థులకు విద్యాబోధనకు ఇబ్బంది ఎదురవుతుందన్నారు. ఒక వైద్య కళాశాలకు ఏడాదికి పది నుంచి 15 పార్థివ దేహాలు అవసరమని, కానీ దానం చేయడానికి కుటుంబ సభ్యులు  అపోహలు, సెంటిమెంట్ల వల్ల ముందుకు రావడం లేదన్నారు. ఈ అంశం మీద ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

పార్టీవ దేహాలు దానం చేసిన కుటుంబ సభ్యులు కళ్యాణ చక్రవర్తి, గోవర్ధన్ రేఖ ఉపాధ్యాయ, అశోక ఉపాధ్యాయ తదితరులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ దేవేంద్ర సింగ్ నేగి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శైలేంద్ర, డాక్టర్ భీమల్ దేవి, డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ మౌనిక తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు వైద్య విద్యార్థులు అనాటమీపై తయారుచేసిన పోస్టర్లను ప్రదర్శించారు. ప్రత్యేకంగా రూపొందించిన స్కీర్ట్ తో పాటు నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.