calender_icon.png 18 December, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుండెపోటుతో సర్పంచ్ అభ్యర్థి మృతి

10-12-2025 12:35:27 AM

మహబూబాబాద్ జిల్లా నడివాడలో ఘటన

మహబూబాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): గుండెపోటు తో సర్పంచ్ అభ్యర్థి మరణించిన ఘటన మహబూబాబాద్ జిల్లా నడివాడ గ్రామంలో మంగళవా రం జరిగింది. కాంగ్రెస్ మద్దతుతో నడివాడ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా రాయపాటి బుచ్చిరెడ్డి (70) పోటీలో ఉన్నారు. సోమవారం రాత్రి వరకు గ్రామంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటికి వెళ్లి నిద్రించే క్రమంలో అస్వస్థకు గురికాగా కుటుంబ సభ్యులు ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.

అక్కడ  చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. గ్రామంలో ప్రతి ఒక్కరికి సు పరిచితుడైన బుచ్చిరెడ్డి ఈసారి సర్పంచ్‌గా పోటీ చేయడానికి ఎన్నికల్లో నిల బడ్డాడు. మరో 48 గంటల వ్యవధిలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా బు చ్చిరెడ్డి మరణంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.