calender_icon.png 14 December, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు, మూడో విడతలోనూ గెలుస్తాం

14-12-2025 12:10:21 AM

  1. పంచాయతీ ఎన్నికల్లో మేము గెలవని జిల్లానేలేదు
  2. కేంద్ర ప్రభుత్వ పథకాలే గ్రామాలకు అందుతున్నాయి
  3. బీజేపీని ఎదుర్కొనేందుకు బీఆర్‌ఎస్ కాంగ్రెస్ ఒక్కటి
  4. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

హైదరాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీజేపీ 300కుపైగా సర్పంచ్ స్థానాలను గెలిచిందని, రెండు, మూడో విడతలో కూడా వీటికంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో ఆయన మట్లాడారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ వంటి జిల్లాలతోపాటు మిగతా జిల్లాల్లో కూడా బీజేపీ ఘన విజయం సా ధించిందని తెలిపారు.

భారతీయ జనతా పార్టీకి మద్దతిచ్చిన ప్రజలందరికీ ధన్యవాదా లు తెలిపారు. వచ్చే రెండు విడతల్లోనూ బీజేపీని ఆదరించి, ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ విజయం రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కూడా ఉంటుందన్నారు. గతంలో తమకు ఒక్క సర్పంచ్ కూడాలేని జనగాంలో రెండు, మహబూబాబాద్‌లో ఆరు స్థానాలు, భూపాలపకల్లిలో మూడు , సంగారెడ్డిలో ఆరు, వనపర్తిలో ఆరు, నాగర్ కర్నూల్‌లో మూడు, వార్డు సభ్యులతో పాటు ఉపసర్పంచ్ కూడా చాలామంది బీజేపీ మద్దతు తో గెలిచారని తెలిపారు.

తాము గెలవని జిల్లానే లేదన్నారు. మొదటిసారి తమ ప్రయత్నంలో బీజేపీ గ్రామీణ ప్రాంతాల్లో వార్డు వార్డుకు వెళ్లిందని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మేము 6000 గెలిచాం.. మేము 4000 గెలిచామని చెప్పుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు అందుతున్నాయి .ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద కోట్లాది రూపాయలు  రోడ్ల కోసం ఇస్తే వాటిని దారి మళ్లించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదన్నారు.

గతంలో కేంద్రం నిధులను బీఆర్‌ఎస్ మళ్లించినట్లే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తోందన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ తోడు దొంగలని ప్రజలు భావిస్తున్నారన్నారు. వీరికి స్టాలిన్, అఖిలేష్, మమతా బెనర్జీ వంటి వాళ్లు మద్దతుందన్నారు. బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ బీఆర్‌ఎస్ ఒకటి అవుతున్నాయని తెలిపారు. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఇండీ గ్రూపులో ఉన్నారని, ఆ గ్రూపుకు కాంగ్రెస్ నాయకత్వం వహిస్తోందని..

అలాంటప్పుడు ఆ కూటమిలో ఉన్న అఖిలేష్ యాదవ్ కేటీఆర్‌ను ఎలా కలుస్తారని నిలదీశారు. వీళ్లకి రాజకీయ ప్రత్యర్థి బీజేపీ కాబట్టి వాళ్లు కలుస్తున్నారు..గతంలో స్టాలిన్ పిలిచినప్పుడు కూడా రెండు పార్టీల నేతలు వెళ్లారని, ఈ రాజకీయాలను చూస్తున్నారని, బీజేపీతో పోరాడటానికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలుస్తున్నాయని చెప్పారు. 

ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్ రాద్ధాంతం

ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని రాంచందర్ రావు తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఎస్‌ఐఆర్‌పై నిర్వ హించిన వర్క్ షాప్‌లో రాంచందర్ రావు పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రత్యూష్ కాంత్ వర్చువల్‌గా ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు, వాస్తవాలను వివరించారు. ఎస్‌ఐఆర్‌పై కేంద్ర హోం మంత్రిఅమిత్ షా ప్రసంగాన్ని పార్టీ ప్రతినిధులకు మరోసారి వినిపించారు. ఈ వర్క్‌షాపులో  బీజేపీ  రాష్ట్ర పదాధికారులు, అధికార ప్రతినిధులు, మీడియా విభాగంతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.