14-12-2025 12:10:41 AM
మహబూబాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవాపూర్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యరు. ప్రాథమిక సమాచారం మేరకు హనుమకొండ జిల్లా అయిన వోలు మండలం నందనం గ్రామంలో ఆదివారం నిర్వహించనున్న రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి హైదరాబాదు నుంచి ద్విచక్ర వాహనంపై వీరు వెళ్తున్నారు.
వరంగల్ జాతీయ రహదారిపై రాఘవాపూర్ వద్దకు రాగానే వీరి ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు అక్క డికక్కడే దుర్మరణం పాలైనట్లు చెబుతున్నారు. హనుమకొండ జిల్లా అయినవోలు మండలం నందనం గ్రామానికి చెందిన కళ్యాణ్, నవీన్ గా గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జనగామ జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.