14-12-2025 12:00:00 AM
ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహాణకు అనుమతి
బెంగళూరు, డిసెంబర్ 13 : ఐపీఎల్ 2026 సీజన్ ముంగిట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి, ఆ జట్టు అభిమానులకు జోష్ పెంచే న్యూస్... బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతినిచ్చింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో చాంపియన్‌గా నిలిచిన తర్వాత ఆర్సీ బీ ఫ్రాంచైజీ తమ అభిమానుల కోసం బెంగళూరులో విక్టరీ పరేడ్ నిర్వహించింది.
దీనికి అభిమానులు భారీగా తరలివచ్చారు. అయి తే ఏర్పాట్ల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, పోలీసులు బలగాలు సరిపోకపోవడం, విపరీతమైన ఫ్యాన్స్ రద్దీ కార ణంగా తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణా లు కోల్పోయారు. దేశ చరిత్రలోనే ఇదొక విషాదం మిగిలిపోయింది. ఈ ఘటనకు సం బంధించి ఆర్సీబీ, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌పైనా కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లకు అనుమతి నిరాకరిస్తున్నారు.
తాజాగా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ నూతన కార్యవ ర్గం ఏర్పడింది. భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ ప్రెసిడెంట్‌గా ఎన్నికవగా.. మొ దట ఆర్సీబీ హోంగ్రౌండ్‌ను ఇక్కడ నుంచి తరలించకుండా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయ డం దగ్గర నుంచి గట్టి ప్రయత్నాలు చేశారు. దీనిపై కర్ణాటక ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో చర్చించి మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతినిచ్చారు.
అయితే భద్రతా ఏర్పా ట్లు, కమిటీ చేసిన సూచనలపై పూర్తిస్థాయి లో పరిశీలించిన తర్వాత అధికారిక ఉత్తర్వులు, షరతులు జారీ చేయనున్నారు. కర్ణా టక రాష్ట్రం గౌరవానికి సంబంధించిన విష యం కావడంతో పకడ్బందీగా వ్యవహరిస్తున్నట్టు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పారు. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లను పూర్తిగా నిలిపివేసే ఉద్దేశం తమకు లేదని, అభిమానుల శ్రేయస్సే ప్రధానంగా నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.