07-08-2025 01:56:01 AM
- భారత్‌పై 50 శాతానికి చేరిన అమెరికా సుంకాలు
- సంతకం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
- ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్నట్టు వెల్లడి
- రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందునే ఈ నిర్ణయం
వాషింగ్టన్, ఆగస్టు 6: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై మరోసారి సుంకాలతో విరుచుకుపడ్డారు. ఇప్పటికే భారత్‌పై 25 శాతం సుంకంతో పాటు పెనా ల్టీ విధించిన ట్రంప్.. తాజాగా భారత్‌పై మ రో 25 శాతం అదనపు టారిఫ్ విధిస్తూ నిర్ణ యం తీసుకున్నారు. ఈ మేరకు బుధవారం సుంకాల పెంపుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేశారు. దీంతో భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై విధించిన సుంకం 50 శాతానికి చేరినట్టయింది.
పెంచిన సుంకాలు ఈ నెల 27 నుం చి అమల్లోకి రానున్నట్టు ట్రంప్ కార్యవర్గం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. రష్యా నుం చి భారత్ ముడి చమురు కొనుగోలు చేస్తుందన్న సాకుతోనే ట్రంప్ ప్రధానంగా సుం కాలు పెంచినట్టు తెలుస్తోంది. మొదటి నుం చి రష్యాతో భారత్ వ్యాపారం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన ట్రంప్.. ఇటీవలే రష్యా భారత్‌కు మద్దతుగా నిలవడం మరింత రెచ్చొగొట్టింది. దీంతో 24 గంటల్లో సుంకా లు పెంచుతానని మంగళవారం ప్రకటన విడుదల చేసిన ట్రంప్ తాను అన్నంత పని చేశారు.
తొలుత జూలై 30న భారత్‌పై 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్ సుంకం తో పాటు అదనంగా పెనాల్టీ కూడా విధించారు. ఈ సుంకాలు ఈ నెల 7 నుంచి అమ ల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఒకవేళ పెం చిన సుంకాలకు ప్రతీకారంగా భారత్ ఏదైనా సుంకాలు వడ్డించాలని ప్రయత్నిస్తే టారిఫ్‌లను ట్రంప్ మరోసారి సవరించొచ్చని వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంలో భాగంగా ఒక్కో దేశాన్ని తన దారికి తెచ్చుకునే క్రమం లో సుంకాల విధింపు మొదలుపెట్టారు. తా జాగా రష్యాతో వ్యాపారం చేస్తుందన్న కారణంతో భారత్‌పై ఏకంగా 50 శాతం టారిఫ్ మోపారు. దీంతో చైనా తర్వాత ఆసియాలో అత్యధిక టారిఫ్ ఎదుర్కొంటున్న దేశంగా భారత్ నిలిచింది.
ప్రస్తుతం చైనా ఉత్పత్తులపై అమెరికా 51 శాతం సుంకం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రంప్ సుంకాల పెంపుపై కాంగ్రెస్ స్పందించింది. ‘నరేంద్ర మోదీ మిత్రుడు ట్రంప్ భారత్‌పై మొత్తంగా 50 శాతం సుంకాలు విధించారు. ట్రంప్ నిరంతరం మన దేశంపై చర్యలు తీసుకుంటున్నా.. ప్రధాని మోదీ మాత్రం ఆయన పే రు కూడా ప్రస్తావించడం లేదు. ఇప్పటికైనా మోదీ స్పందించి ట్రంప్ చర్యలకు తగిన స మాధానం ఇవ్వాలని ‘ఎక్స్’లో పేర్కొంది. అదనపు సుంకాలు విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. దీన్ని దురదృష్టకరమైన చర్యగా పేర్కొంది. జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చ ర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
ఆ మాట నేను అనలేదు: ట్రంప్
రష్యాతో వ్యాపారం చేస్తున్న దేశాలపై భారీగా సుంకాలు విధిస్తానని హెచ్చరించిన సంగతి తెలిసిందే. రష్యాతో చమురు వాణిజ్యం చేస్తే భారత్ సహా ఆయా దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తానంటూ బెదిరింపులకు దిగారు. అయితే తాజాగా ట్రంప్ దీనిపై మాట మా ర్చారు. అదనపు టారిఫ్‌లపై అలాం టి శాతాలేవి తాను చెప్పలేదన్నారు. వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘నేనేప్పుడూ సుంకాలపై శా తాల గురించి చెప్పలేదు. కానీ దాని పై కసరత్తులు చేస్తున్నాం. ఏం జరుగుతుందో చూడాలి. చాలా తక్కువ సమయంలోనే దీనిపై నిర్ణయం తీ సుకునే అవకాశముంది’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.