07-08-2025 01:54:12 AM
- ఉత్తరకాశీ వరదల్లో కొట్టుకుపోయిన కేరళ, మహారాష్ట్ర వాసులు
- ధరాలీలో కొనసాగుతున్న సహాయక చర్యలు
- భారీ వరదలు.. కైలాస్ యాత్రలో చిక్కుకున్న యాత్రికులు
వారణాసి, ఆగస్టు 6: ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీలో సంభవించిన ఆకస్మిక వరదల్లో ధరాలీ గ్రామం పూర్తిగా కొట్టుకు పోయిన సంగతి తెలిసిందే. అయితే విపత్తులో అక్కడికి వెళ్లిన 28 మంది పర్యాట కుల బృందం గల్లంతైంది. ఆ బృందంలో 20 మంది మహారాష్ట్ర స్థిరపడగా.. మిగిలిన 8 మంది కేరళలోని వివిధ జిల్లాలకు చెందిన వారిగా తెలిసింది. ధరాలీలో సంభవించిన మెరుపు వరదల్లో ఐదుగురు మృతి చెంద గా.. వంద మందికి పైగా గల్లంతయ్యా రు.
ఈ బృందంలోని ఒక జంట బంధువు మీడియాతో మాట్లాడుతూ.. ‘ఉత్తరకాశీ నుంచి బృందం సభ్యులంతా మంగళవారం ఉద యం 8.30 గంటలకు గంగోత్రికి బయల్దేరినట్టు వెల్లడించారు. వారి మార్గంలో కొం డచరియలు విరిగిపడ్డాయి. ఆ తర్వాత నుం చి వారితో ఎటువంటి కాంటాక్టు లేదు. ఫోన్ల లో బ్యాటరీ అయిపోయిందా లేక వారున్న చోట సిగ్నల్ లేదా అనేది అర్థం కావడం లేదు’ అని పేర్కొన్నారు. హరిద్వార్‌కు చెంది న ఒక ట్రావెల్ ఏజెన్సీ 10 రోజుల పాటు ఉ త్తరాఖండ్ ట్రిప్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
కొనసాగుతున్న రెస్యూ ఆపరేషన్
ఉత్తరకాశీ జిల్లాలోని ధరాలీ గ్రామాన్ని ముంచెత్తిన జలప్రళయంలో మృతుల సం ఖ్య ఐదుకు పెరిగింది. ఈ దుర్ఘటనలో మంగళవారమే నాలుగు మృతదేహాలు లభ్యమ వగా.. బుధవారం చేపట్టిన సహాయక చర్య ల్లో మరో వ్యక్తి మృతదేహం దొరికింది. దీం తో మొత్తం మృతుల సంఖ్య ఐదుకు పెరిగిం ది. ఆర్మీ, ఐటీబీపీ బలగాలు తమ రెస్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ధరాలీ గ్రా మం పూర్తిగా కొండలు, గుట్టలు నడుమ ఉండటంతో భారత ఆర్మీ, విపత్తు నిర్వహణ బలగాలు గాలిస్తున్నాయి. అక్కడక్కడ చిక్కుకున ్న మొత్తం 150 మందిని కాపాడాయి. ఆచూకీ లేని మరికొందరి కోసం ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది.
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షం
హరిద్వార్‌లోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గంగానది నీటిమ ట్టం పెరుగుతుందని వాతావరణ శాఖ హె చ్చరికలు జారీ చేసింది. స్థానిక ప్రజలు ఘాట్‌ల నుంచి దూరంగా ఉండాలని.. తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరించారు. వరదల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉత్తరాఖండ్ ప్రభుత్వ అధికారుల ప్రకారం ఇప్ప టివరకు 130 మందికి పైగా ప్రజలను సహాయక బృందాలు రక్షించాయి. భారీ వర దలకు 4 జాతీయ రహదారులతో సహా 617 రోడ్లు ధ్వంసమయ్యాయి.
కైలాస్ యాత్ర.. 413 మంది యాత్రికులు సురక్షితం
భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. హిమాచల్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కిన్నౌర్ జిల్లాలో భారీ వరదలు సంభవించడంతో కైలాస్ యాత్ర ట్రెక్కింగ్ మార్గంలో వందలాది మంది యాత్రికులు చిక్కుకుపోయారు. వెంటనే స్పందించిన ఐటీబీపీ సిబ్బంది 413 మంది యాత్రికులను కాపాడారు. సహాయక చర్యల్లో 14 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు పాల్గొన్నాయని.. వరదల ధాటికి ట్రెక్కింగ్ మార్గాలు ధ్వంసం కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ప్రతికూల పరిస్థితుల దృష్యా, కిన్నౌర్ కైలాష్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.