calender_icon.png 7 August, 2025 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏండ్ల నాటి కళ చేనేత

07-08-2025 12:52:13 AM

నేడు జాతీయ చేనేత దినోత్సవం :

చేనేత ఈనాటిది కాదు. ఏండ్ల నుం చి ఈ కళ విరాజిల్లుతూ వస్తుంది. ఎన్ని అవస్థలు, అవరోధాలు ఎదురైనా నే తన్నలు మాత్రం ఈ వృత్తిని వదలట్లేదు. రెడీమేడ్ రాజ్యంలో చేనేత ఆదరణ కోల్పోయి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఎన్ని పథకాలు  తీసుకొచ్చినా నేతన్న పరిస్థితి మాత్రం మెరుగ వడం లేదు. రోజురోజుకూ నేతన్నలు అ ప్పుల ఊబిలో కూరుకుపోతూ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

స్వాతంత్రోద్యమంలో 1905 సంవత్సరానికి ఉన్న ప్రాముఖ్యత ఎంత చెప్పుకున్నా తక్కువే అ వుతుంది. అటువంటి 1905లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగిన ‘స్వదేశీ’ ఉద్యమానికి గుర్తుగా 2015 నుంచి చేనేత దినోత్సవం జరుపుతున్నారు. స్వాతంత్ర పోరాట సమయంలో అంతా ఖద్దర్ దుస్తు లే ధరించాలని, మరీ ముఖ్యంగా మన దే శంలో తయారైన ఖద్దర్ దుస్తులే ధరించాలని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

చేనేత వస్త్రాలు కేవలం బట్టలు మాత్రమే కాకుం డా ప్రతి ప్రాంతం చరిత్ర, సంస్కృతి, కళాత్మకతను ప్రతిబింబిస్తాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశ వ్యాప్తంగా ప్రత్యక్షంగా దాదాపు కోటి 30 లక్షల మంది, పరోక్షం గా 10 కోట్ల మందికి పైనే జనాభా ఈ రంగాన్ని నమ్ముకుని బతుకుబండిని వెళ్లదీస్తున్నట్టు అంచనా. తెలుగు రాష్ట్రాల్లో దా దాపు 12 శాతం మంది ఈ రంగంపై ఆధారపడి ఉన్నారు. 

పోచంపల్లి చీరల ప్రత్యేకత అదే.. 

వస్త్రాలు నేసే వాళ్లను నేతగాడు/నేతకారుడని, మగ్గంపై బట్టలు నేసి వాటిని అ మ్ముకొని జీవించే వారిని నేతకారులు లే దా సాలే వాళ్లు అంటారు. వీళ్లు చేసే వృత్తి ని ‘చేనేత వృత్తి’ అని పేర్కొంటారు. చేనేత వస్త్రాల్లోని దారాలను పడుగు (వార్ప్), పేక (వెఫ్ట్)గా గుర్తిస్తారు పడుగు దారాలు పైనుంచి కిందికి (నిలువు), పేక- దారాలు ఎడమ నుంచి కుడికి (అడ్డం) ఉంటాయి. వస్త్రాలను తయారు చేయడంలో ఈ దా రాలు అత్యంత కీలకం.

చేనేత వస్త్రాలలో చీ రలు, పంచలు, దుప్పట్లు, తలపాగాలు, లుంగీలు మొదలగునవి తయారు చేస్తున్నారు. తెలంగాణలోని పోచంపల్లి ఇక్కత్ చీరలకు ప్రసిద్ధి. ఇక్కత్ అంటే మగ్గం మీద నేతకు ముందే నూలుకు ఒక ప్రత్యేక పద్ధతిలో రంగులు అద్దడం. ఇక్కడి చీరలకు ఒ క ప్రత్యేకత ఉంది. ఇవి ఇతర చీరలకంటే భిన్నంగా ఉంటాయి.

ఒక అందమైన వస్త్రం దాన్ని ధరించిన వారి అందాన్ని మరింత పెంచుతుందని, కానీ తెలంగాణ చేనేత వ స్త్రాలు మాత్రం అందంతోపాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని ఇటీవల హైద రాబాద్‌లో జరిగిన ‘మిస్ వరల్డ్ 2025’ పోటీలకు డిజైనర్‌గా పనిచేసిన అంతర్జాతీయ దుస్తుల డిజైనర్ అర్చన కొచ్చర్ తె లంగాణ చేనేత వస్త్రాల గొప్పతనాన్ని ప్ర శంసించారు.

డిసెంబర్ 6 నుంచి 14 వర కు ఇటలీలో జరగబోయే ‘మిలాన్’ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు తెలంగాణ చేనేత క ళాకారుడు విజయ్‌రాజేంద్రవర్మను కేంద్రప్రభుత్వ టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. ఈ అవకాశం తెలంగాణకు దక్క డం ఇదే తొలిసారి. ఇతడు 250 మగ్గాలపై గద్వాల, కొత్తకోట చీరలు నేయిస్తూ చేనేత కుటుంబాలకు ఉపాధిని కల్పిస్తున్నాడు.

2015 నుంచి ప్రత్యేక దినంగా.. 

భారత్‌లో చేనేతకు ఎన్నో ఏండ్ల చరిత్ర ఉన్నా ప్రత్యేక దినం మాత్రం లేదు. దీంతో చేనేత రంగం గురించి, ఆ రంగం గొప్పతనం గురించి సరిగ్గా ప్రచారం జరగలేదు. కానీ 2015లో ఆగస్టు 7న చెన్నైలో చేనేత ప్రత్యేక దినానికి అంకురార్పణ జరిగింది. ఆగస్టు 7న చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమం లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభిం చి, లోగోను ఆవిష్కరించారు.

అలాగే ఆగ స్టు  7ని ‘జాతీయ చేనేత దినోత్సవం’గా ప రిగణిస్తున్నట్టు ప్రకటించారు. 2015లో ప్ర త్యేక దినం ప్రకటించడం వెనుక అనేక మంది పోరాటం ఉంది. స్వాతంత్ర సమరంలో కీలకపాత్ర పోషించిన చేనేత ప్రా ముఖ్యత గుర్తించాలని, ఆ రంగాన్ని అభివృద్ధి చేయాలని అనేక మంది కోరారు. జా తీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత రంగంలో ప్రతిభ కనబరిచిన కార్మికులకు ‘సంత్ కబీర్’ పురస్కారం ప్ర దానం చేస్తున్నారు.

తెలంగాణలో కూడా ప్రతి ఏడాది ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘జాతీ య చేనేత దినోత్సవం’ జరుపుతున్నారు. 10 రోజులపాటు జాతీయ చేనేత ఎగ్జిబిషన్ కూడా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తరఫున ‘శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ’ పురస్కారం అందజేస్తూ వస్తున్నారు. 

చేనేత అభివృద్ధికి పలు పథకాలు

చేనేత రంగం అభివృద్ధికి భారత ప్రభు త్వం కొన్ని సంస్థల ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. జాతీయ చేనే త అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌డీసీ), సమగ్ర చేనేత క్లస్టర్ అభివృద్ధి పథకం (సీహెచ్‌సీడీఎస్), చేనేత కార్మికుల సమగ్ర సంక్షేమ పథకం (హెచ్‌డబ్ల్యూ సీడబ్ల్యూఎస్), నూ లు సరఫరా పథకం ప్రవేశపెట్టారు.

ఇవి మాత్రమే కాకుండా చేనేత కార్మికుల సంక్షే మం కొరకు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) మహాత్మాగాంధీ బునకర్ బీమా యోజన (ఎంజీబీ బీవై) ద్వారా బీమా సహాయాన్ని అందిస్తూ వస్తున్నారు. చేనేత పరిశ్రమలు, కార్మికులను ఆదుకోనేందుకు తెలంగాణలో కూ డా నేతన్న బీమా పథకం, చేనేత మిత్ర, పా వలా వడ్డీ, నేతన్నకు చేయూత మొదలైన పథకాలున్నాయి.  

నేతన్న నెత్తిన సమస్యల పిడుగు

చేనేత పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం గురించి ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపట్టినప్పటికీ నేతన్నలు మాత్రం సమస్యల సుడిగుండంలోనే జీవనం సాగిస్తున్నారు. ఈ సమస్యలు, సవాళ్లతో చేనేత రంగం తిరోగమనంలో పయనిస్తుం ది.

ముడి సరుకుల ధరలు పెరగడం, పెట్టుబడులు అందుబాటులో లేకపోవడం, బ ట్టల మిల్లులు, ఫ్యాక్టరీలు, మరమగ్గాల నుంచి పోటీ, ఏడాది పొడవునా పని ల భించకపోవడం, నేసిన వస్త్రాలకు గిట్టుబా టు ధర లేకపోవడం, ఉత్పత్తి వ్యయం ఎ క్కువ అవడం, రుణ సమస్యలు, ఆధునికీకరణకు నిధుల కొరత మొదలగు సమస్య లతో సతమతమవుతోంది.

ఆధునిక కా లంలో అనేక ఆటుపోట్లకు గురవుతున్న చేనేత పరిశ్రమ మనుగడకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాల్సిన అవస రం ఉంది. ఏండ్లుగా ఉన్న ఉట్టిపడే మన కళను కాపాడాల్సిన ఆవశ్యకత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైనే కాకుండా సాధారణ పౌరులపై కూడా ఉంది. 

డాక్టర్ దాసరి సత్యనారాయణ 

రచయిత సెల్: 9948857465