10-08-2025 10:12:50 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆదివారం డిసిసి ఉపాధ్యక్షుడు వాకిటి అనంతరెడ్డి, మాజీ జెడ్పిటిసి వాకిటి పద్మ సత్యనారాయణ స్వామి వ్రతం, ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.